మోడీ సహా పలువురు ప్రముఖులను టార్గెట్ చేసిన టెర్రరిస్టులు
- November 20, 2017
ప్రధాని మోదీ, వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యను.. ఐసిస్ ఉగ్రవాద సంస్థ టార్గెట్ చేసిందా?. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రభూతం నుంచి వీరిద్దరికీ ముప్పుందా?. అంటే.. అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. ప్రధాని, ఉప రాష్ట్రపతితో పాటు పలువురు బీజేపీ నేతలను ఉగ్రవాదులు టార్గెట్‌గా ఎంచుకున్నారని ఇంటెలిజెన్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రముఖులు పాల్గొనే భారీ బహిరంగ సభల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడొచ్చని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీపైనే ఐసిస్ టెర్రరిస్టులు ఫోకస్ చేశారని.. అక్కడ జరిగే కార్యక్రమాలనే టార్గెట్‌గా ఎంచుకున్నారని వార్నింగ్ ఇస్తున్నారు.
భారత్‌లో భారీస్థాయిలో దాడులు చేసేందుకు.. ఐసిస్ ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. మోదీ, వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్, అమిత్ షాతో పాటు గోవా, ఉత్తర్‌ప్రదేశ్ సీఎంలు మనోహర్ పారికర్, యోగి ఆదిత్యనాథ్‌పైనా ఉగ్రవాదుల గురి ఉందని హెచ్చరిస్తున్నాయి. వీరిందరూ ఐసిస్ హిట్‌లిస్ట్‌లో ఉన్నట్లు తమ దగ్గర సమాచారముందని వెల్లడించాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉగ్రదాడులకు అవకాశముందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. ప్రధాని మోదీ పాల్గొనే ఎన్నికల సభలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు చేసేందుకు పథకం వేసినట్టు చెప్తున్నారు.
చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో.. ఈశాన్య భారతంలో కేంద్ర ప్రభుత్వం నిఘా పెంచింది. అక్కడ చీమ చిటుక్కుమన్నా తెలిసేలా.. నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఐసిస్ కుట్రలు బయటపడ్డాయి. మోదీ సహా పలువురు ప్రముఖులను టెర్రరిస్టులు టార్గెట్ చేసినట్లు.. అసోం నుంచి నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష