'పద్మావతి' లొల్లి

- November 21, 2017 , by Maagulf
'పద్మావతి' లొల్లి

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ప్రతిష్టాత్మంగా తెరకెక్కించిన 'పద్మావతి' చిత్రంపై రగులుకున్న రాజకీయ రగడ ఇప్పట్లో చల్లారేలా లేదు. సందట్లో సడేమియాగా ఈ వివాదం నుంచి లబ్ది పొందేందుకు రాజకీయ పార్టీలు.. ప్రత్యేకించి బీజేపీ ఉవ్విళ్లూరుతున్నట్టు కనిపిస్తోంది. భోపాల్‌లో మహారాణి పద్మావతికి స్మారకమందిరం నిర్మిస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ప్రకటించారు. రాణి పద్మావతిని రాష్ట్రమాతగా పేర్కొన్న ఆయన... రాణి పేరుమీదుగా ఓ అవార్డు కూడా ప్రారంభించాలని నిర్ణయించారు. మహిళల అభివృద్ధి కోసం కృషిచేసేవారికి ''రాష్ట్రమాత పద్మావతి పురస్కార్''తో సత్కరిస్తామని ఆయన ప్రకటించారు. రాజ్‌పుత్ వర్గీయుల మనోభావాలను గాయపర్చే సన్నివేశాలను తొలగించకపోతే.. తమ రాష్ట్రంలో పద్మవతి సినిమాను విడుదల కానివ్వబోమని మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. మరుసటిరోజే ఈ అంశంపై ఈ బీజేపీ నేత మరింత దూకుడు ప్రదర్శించడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com