మన కోసం మన మెట్రో
- November 21, 2017
హైదరాబాద్ కి గర్వకారణం, లక్షలాది ప్రజలకి ట్రాఫిక్ సమస్యలని దూరం చేసే మెట్రో ప్రారంభానికి అంతా సిద్ధం అవుతోంది. మెట్రో సేఫ్టీ అథారిటీ నుంచి క్లియరెన్స్ రావడం తో ఈ నెల 28న మెట్రో ని ప్రారంభించేందుకు ఎల్&టి శరవేగంగా పనులు పూర్తి చేస్తోంది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ లో నిర్మాణం అయిన మెట్రోలలో మన మెట్రో నే ప్రపంచంలోనే అతి పెద్దది. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి 20 వేల కోట్ల రూపాయలకి పైగానే ఖర్చు కానుంది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు 15 వేల కోట్లు కాగా, ప్రాజెక్ట్ ఆలస్యం కావడం తో 20 వేల కోట్లకు చేరనుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వం నిధులు సుమారు 1500 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం 269 ఎకరాలు భూమి ఇచ్చింది. ఎల్&టి సంస్థ ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 20 వేల కోట్లు అప్పులు సమీకరించాల్సి ఉంటుంది. దీనిలో సగం 10 వేల కోట్లని L&T సమీకరించి ఖర్చు చేసింది. సుమారు 20 వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేనాటికి రోజుకి లక్ష మంది మెట్రో లో ప్రయాణించవచ్చు. అంటే ఒక్కో ప్రయణీకుడి మీద ఎంత ఖర్చు అవుతుంది అని లెక్కవేస్తె కళ్ళు తిరిగే సంఖ్య తేలుతోంది. అదెలా అంటే..
మొత్తం ఖర్చు 20వేల కోట్లు 8% వడ్డీకి అప్పు తెస్తే..
నెలకి 146,75,00,000 అంటే 146 కోట్ల రూపాయలు EMI అవుతుంది.
అంటే రోజుకి సుమారు 5 కోట్ల రూపాయలు EMI కింద పక్కన పెట్టాలి.
మొత్తం ఖర్చులో 50% రియల్ ఎస్టేట్ ద్వారా, 45% టిక్కెట్ల ద్వారా, 5% ప్రకటనల ద్వారా తిరిగి రాబట్టుకోవాలి అని L&T అంచనా.
మూడు మార్గాలు పూర్తయ్యేసరికి రోజుకి లక్ష మంది ప్రయాణీకులు మెట్రోని ఉపయోగించుకునే వీలుంది.
లక్ష మంది ప్రయాణీకులనుంచి రోజుకి 5 కోట్లలో సగం డబ్బు 2.5 కోట్లు రాబట్టుకోవాలన్నా, ఒక్కో టికెట్ 250 రూపాయలు ఉండాలి. (నిర్వహణ ఖర్చులు కాకుండా) కానీ ఇప్పుడున్న సమాచారం ప్రకారం గరిష్ట టికెట్ ధర రూ.50 ఉండే వీలుంది. అంటే ఒక్క ప్రయాణీకుడి మీద L&T రూ.200 నష్టాన్ని భరించాలి.
మెట్రో మాల్స్, మెట్రో స్టేషన్లలో ఉండే స్టాల్స్ కి భారీగా రెంట్స్ వస్తే L&T కి పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది. ప్రాజెక్ట్ పూర్తయ్యాక జపాన్ బ్యాంకుల నుంచి 2% వడ్డీకి ఋణం తీసుకుని మన దేశ బ్యాంకుల అప్పు తీర్చేస్తే వడ్డీ భారం బాగా తగ్గుతుంది. అప్పుడు మెట్రో లాభదాయకం కావచ్చు. ప్రయాణీకుల సంఖ్య బాగా పెరిగి, రోజుకి కనీసం రెండు లక్షల మంది మెట్రోని ఉపయోగించుకుంటే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







