విజయవంతమైన జీశాట్-15
- November 12, 2015
బారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 3.04 గంటలకు జీశాట్-15 ఉపగ్రహాన్ని ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఈ అంతరిక్ష కేంద్రం రూపొందించిన అరైన్5వీఏ227 రాకెట్ ద్వారా 3,164 కిలోల బరువైన జీశాట్-15 ఉపగ్రహంతో పాటు అరబ్‌శాట్-6బీను రోదసీలోకి పంపారు. 43.24 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తిచేశారు. ఈ ఉపగ్రహాన్ని 250 కిలోమీటర్ల పెరిజీ (భూమికి దగ్గరగా), 35,819 కిలోమీటర్ల అపోజీ (భూమికి దూరంగా) భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇది నిర్ణీత కక్ష్యలోకి చేరగానే బెంగళూరులోని హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ తమ అధీనంలోకి తీసుకున్నారు. జీశాట్-15 ఉపగ్రహంలో 24 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లు, రెండు గగన్(జీపీఎస్ ఎయిడెడ్. జియో ఆగ్యుమెంట్ నావిగేషన్) పేలోడ్లు అమర్చారు. ఇన్‌శాట్-3ఏ, ఇన్‌శాట్-4బీ ఉపగ్రహాల కాలపరిమితి ముగియడంతో సుమారు రూ.800 కోట్ల వ్యయంతో తయారుచేసిన జీశాట్-15ను ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం ద్వారా మెరుగైన టెలివిజన్ ప్రసారాలు, విమానాల సిగ్నల్స్ అందుతాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







