8 ఏళ్ళ చిన్నారిపై హత్యాచారం: దోషికి మరణశిక్ష అమలు
- November 23, 2017
దుబాయ్: 8 ఏళ్ళ చిన్నారిపై కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడి, ఆనక ఆ చిన్నారిని హతమార్చిన ఘటనలో 49 ఏళ్ళ వ్యక్తికి మరణశిక్షను అమలు చేశారు. గురువారం ఉదయం ఈ శిక్షను అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. నిదాల్ ఎస్సా అబ్దుల్లా అనే వ్యక్తి, 8 ఏళ్ళ ఒబైదా చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. ఈ ఘటనలో నిందితుడిపై నేరారోపణలు రుజువయ్యాయి. 2016 మే 20న చిన్నారి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. రెండ్రోజుల తర్వాత చిన్నారి మృతదేహం అల్ వర్కా ఏరియాలో లభ్యమయ్యింది. నిదాల్ ఎస్సాపై కిడ్నాప్ కేసు తొలుత నమోదయ్యింది. ఆ తర్వాత లైంగిక దాడి, హత్యారోపణలూ నమోదు చేశారు. దోషిగా తేలినా, నిదాల్ ఎస్సాపై మరణ శిక్ష మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా దుబాయ్ కోర్ట్ ఆఫ్ కాస్సేషన్ తీర్పు, దుబాయ్ రూలర్ అనుమతితో మరణ శిక్ష విధించడం జరిగింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







