తెలుగు రాష్ట్రాలకు త్వరలో ఉక్కు శుభవార్త
- November 23, 2017
న్యూఢిల్లీ: ఉక్కు పరిశ్రమలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు త్వరలో శుభవార్త వింటాయని కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ అన్నారు. ఈరోజు దిల్లీలో కేంద్రమంత్రి బీరేంద్రసింగ్‌తో కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఏపీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. విభజన చట్టంలో హామీ మేరకు కడప, బయ్యారంలో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుపై చర్చించారు. సుమారు 2 గంటల పాటు సాగిన సమావేశంలో విభజన చట్టం హామీలు నిలబెట్టుకోవాలని బీరేంద్రసింగ్‌ను కోరారు.
ఈ సందర్భంగా బీరేంద్రసింగ్ మాట్లాడుతూ.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉందన్నారు. టాస్క్‌ఫోర్స్ కమిటీ నెలరోజుల్లో నివేదిక ఇస్తుందన్నారు. స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా ఏ తరహా చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చ జరిగినట్లు తెలిపారు. నెల రోజుల తర్వాత మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఉక్కు నాణ్యత అధ్యయనానికి టాస్క్‌ఫోర్స్ కమిటీకి సమయం పడుతుందని పేర్కొన్నారు.
'కడపలో ఉక్కు కర్మాగారం వచ్చి తీరుతుంది. దీని ద్వారా కడప వాసులకు ఉద్యోగాలు వస్తాయి. కడప ఉక్కు కర్మాగారానికి, విశాఖలో ఏర్పాటయ్యే కర్మాగారానికి సంబంధం లేదు` అని కేంద్రమంత్రి సుజనాచౌదరి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







