2018 మే నెలలో దుబాయ్‌లో ఎయిర్‌పోర్ట్ షో
- November 23, 2017
2018 ఎయిర్‌పోర్ట్ షో దుబాయ్‌లో జరగబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఈవెంట్ ఈసారి దుబాయ్‌లో జరగనుంది. 90 దేశాలనుంచి 300 మందికి పైగా ఎగ్జిబిటర్స్ ఈ ఎయిర్‌పోర్ట్ షోలో తమ ఉత్పత్తుల్ని ప్రదర్శనకు ఉంచుతారు. మే 7 నుంచి 9 వరకు ఈ ఎయిర్‌పోర్ట్ షో జరుగుతుంది. దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఛైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్ మాట్లాడుతూ, మిడిల్ ఈస్ట్ రీజియన్, రెండో అతి పెద్ద ప్యాసింజర్ ట్రాఫిక్ గ్రోత్‌ని నమోదు చేస్తోందనీ, అలాగే మిలియన్ డాలర్ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌పాన్షన్ ప్రోగ్రామ్స్‌తో ముందుకెళుతోందనీ, ఈ తరుణంలో దుబాయ్‌లో ఎయిర్‌పోర్ట్ షో మరింతగా ఈ రంగానికి ఊపునిస్తుందని అన్నారు. 18వ ఎడిషన్‌గా ఈ ఈవెంట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఫోరం, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ మిడిల్ ఈస్ట్, సిఎపిఎ - సెంటర్ ఆఫ్ యావియేషన్ గ్లోబల్ ఎయిర్‌పోర్ట్ లీడర్స్ ఫోరమ్, విమెన్ ఇన్ ఏవియేషన్ వంటి ప్రత్యేకతలు సంతరించుకోనుంది. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ, దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ, దుబాయ్ ఏవియేషన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్, దుబాయ్ ఎయిర్ పోర్ట్స్, డిఎన్‌ఎటిఎ, కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అండ్ షిప్పింగ్ అండ్ కార్గో లాజిస్టిక్స్ గ్రూప్ సహకారంతో ఈ షో జరగనుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష