మదిని మీటిన వర్షం-పార్ట్-3
- November 12, 2015
పొద్దున్నే నిద్ర లేచా కోడి కూతకి.. దూరంగా కోయిల కూతలు కింద మేళ తాళాలు శ్రుతి చేసుకుంటున్న భజంత్రీల మంగళ వాయిద్యాల రాగాలు, చల్లని పిల్ల గాలులు ఎంతో ఆహ్లాదం గా వినపడుతున్నాయ్.. ఎదురుగా ఉన్న వర్ష అందమైన ముఖం దేవతలాగా దర్శనం ఇచ్చింది తెలికుండా ఒక చిన్న చిరునవ్వు ఏదో సంతోషం … తను నా కాళ్ళని దిండుగా చేస్కొని, నా చేయి తన చేతులతో గట్టిగా పట్టుకొని ముడుచుకొని పడుకుంది నాకు ఎందుకో చిన్న పాప తన తండ్రిని పట్టుకొని పడుకునట్టుగా అనిపించింది … మెల్లగా తన తల పైన చేయి వేసి మెల్లగా నిమిరాను … అబ్బా తన వెంట్రుకలు సిల్కీ సిల్కీ, తన ముంగురుల పై చేయి వేసి అలా వెనకకు నెడుతుండగానే ఎవరో తలుపు తీస్తున శబ్దం అయింది నేను టక్కున కళ్ళు మూసుకొని నిద్ర నటిస్తూ కొంచం కళ్ళు తెరిచి చూస్తున్న … ఒక 10 మంది అమ్మాయిల బ్యాచ్ ఒక బొండంని ముందు పెట్టుకొని కాలకేయులు లాగ మా వైపే వస్తున్నారు … ఆ బొండం వచ్చి నన్ను టచ్ చేసి లేపింది .. వర్షను వేరే అమ్మాయి లేపింది ఉలిక్కి పడినట్టు లేచాము తను చేయి వదిలించుకొని సర్దుకుంది… బొండం నన్ను సీరియస్ గా చూస్తోంది ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక బిక్క ముఖం తో చూస్తున్నా "ఏంట్రా ఇది అమ్మాయిలూ ఒంటిరిగా కనపడితే వదలరా మీ మగాళ్ళు" అని గద్దించింది ఎందుకు లే పొద్దున్నే ఈ కొప్పులతో కొట్లాడటం అని సారీ అక్క అన్నాను … “ఏరా నీకు అక్క లాగ కనిపిస్తున్నాన” అనింది … కొంచం నీళ్ళునమిలి పైకి కిందకి తనని చూసి “సారీ ఆంటీ” అన్నాను అంతే అందరు గొల్లున నవ్వేసారు … రేయ్ అంది సారీ అక్క అని చెప్పాను… “ఏరా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలిదా” అంది నేను వర్ష వైపు తిరిగి “సారీ వర్ష గారు ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి” అన్నాను “తనతో కాదు నాతో” అంది బొండాం సీరియస్ గా చూస్తూ … “సారీ అక్క అమ్మాయిలతో అన్నావు కదా” అని బదులు ఇచ్చి సైలెంట్ గా అమాయకంగా తనని చూస్తున్నా…. తనకు ఎక్కడో కాలింది ఇంతలో వర్ష "తన తప్పు ఏమి లేదు సారీ భరత్ గారు" అని అందరిని తీసుకెళ్ళింది…. కొంచెం దూరం వెళ్ళాక ఈ లేడీ కాలకేయని వెనక్కి తిరిగి వేలితో తల ఊపుతూ వార్నింగ్ ఇచ్చింది నేను పోవే అని సైగ చేసాను.. వర్ష వెనక్కు తిరిగి ఓర చూపు చూస్తూ చిన్న చిరునవ్వు నవ్వుతు వెళ్లిపోయింది … అంతే అలా కూర్చుండి పోయా గాల్లో తేలుతూ…. బ్యాక్ గ్రౌండ్ లో గాల్లో తెలుతునట్టుందే.. అంటూ ఫాస్ట్ బీట్ రన్నింగ్..
ఇంతలో నా ఫ్రెండ్స్ వచ్చి చుట్టూ నిలపడి నన్ను పిచ్చోడిలా చూస్తున్నారు.. రేయ్ ఏమయింది అని అడిగాడు నేను సిగ్గు పడుతూ నవ్వుకుంటూ నిలపడ్డాను… నైట్ అంతా ఏమి చేసావు ఆ బండది నిన్ను తిట్టుకుంటూ వెళ్తోంది అని… ఆ బండదాని పేరు వినగానే ఎక్కడో కాలింది పేరు లహరి అంట లోడులారి అని పెట్టాల్సింది సరిగ్గా సూట్ అయ్యేది… రూం కి వెళ్లి టక టక మని మొహం కడుక్కొని వర్షని ఇంప్రెస్స్ చేద్దాం అని నాకు ఇష్టమైన టీ షర్టు వేసుకొని పెళ్లి తంతు దగ్గరికి వెళ్ళాను.. అందమైన పెళ్లి మండపం చేమంతి పూల అలంకరణ మధ్య ఆ వేంకటేశ్వరుని పూలతో డిజైన్ చేసారు మండపం లో సీతరాముల్లగా అభి,నందిని కూర్చున్నారు తన పక్కన ఈ ఆడ వానర సైన్యం …. అమ్మాయిలు కనపడగానే ఇక అబ్బాయిలు చేసే తిక్క పనులు తెలిసిందేగా బాగా పెంచిన పొట్టలు లోపలికి లాక్కుని అస్తవ్వస్థాలు పడుతున్నారు.. నేను మాత్రం వర్ష వైపే చూస్తున్న నా చూపులు వర్ష చూపులు కలిసినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పను తను నవ్వి గుడ్ మార్నింగ్ చెప్పింది ఆ చూపుల్లో ఎంత ప్రేమ ఉంది.... కాని పక్కనే ఉన్న ఆ బండదానితో చూపులు కలిసినప్పుడు సవాల్ విసిరాయి, ఆ బండది దాని గ్యాంగ్ మా అభి గాన్ని చాల ఏడిపిస్తున్నారు అని వినగానే కళ్ళు క్రూరంగా దాన్ని చూసి శపథాలు చేసాయి , నేను పెళ్లి కొడుకు పక్కనే కూర్చున్న తోడు పెళ్లి కొడుకు లాగ వర్ష తోడు పెళ్లి కూతురు లాగ తొందరలో మా ఇద్దరిని పెళ్లి పీటలు మీద కూర్చో పెట్టు దేవుడా అని వేడుకున్న “పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం.... కాకి ముక్కు కి దొండపండు అవసరమా ” అనే ఘోష … పెళ్లి తతంగం లో పసుపు రాస్తున్నారు పెళ్లి కొడుక్కి పెళ్లి కుతురురికి…. సడన్ గా గ్యాంగ్ మొత్తం లేచి వెళ్ళిపోయారు అభి గాడికి టెన్షన్ ఏమి చేయబోతున్నారు అని వాడికి ధైర్యం చెప్పాను... ఇంతలో ఎదురుగా గ్యాంగ్ మొత్తం చేతులు వెనక పెట్టుకొని నడుస్తూ వస్తున్నారు …. వర్షని చూడగానే “వయ్యారి భామ నీ హంస నడక ” అని మనసులో పాట పాడుకుంటూ ఉండగానే బండది ముందరికి వచ్చింది "వయ్యారి భామ్మ నీ పంది నడక” అని రీమిక్స్ సాంగ్. వాళ్ళలో వాళ్ళు గుస గుసలు నవ్వులు నేను లేచి మా వాళ్ళను తోడుగా తీసుకొని వాళ్ళకు ఎదురు వెళ్ళాను టీ షర్టు మడిచి ఉన్న కొంచెం కండల్ని చూపిస్తూ ఒక్కొకరు దాపెట్టిన చేయి బయటకు తీసారు చేతిలో పసుపు నింపిన గిన్నెలు మెల్లగా నవ్వుకుంటూ దగ్గరికి వచ్చారు…. అలా నాలుగు అడుగులు వెయ్యగానే …. “రేయ్ తగ్గిపో యవ్వారం తేడాగా ఉంది ఆగిపో” అని మా వాడు వార్నింగ్ … మనం వింటేగా అలాగే వెళ్లి ఎదురు నిలపడ్డాను... “రేయ్ మర్యాదగా పక్కగా జరుగు” అనింది బండది “నువ్వు బయపడితే బయపడటానికి పిల్లి ని కాదు సింహాన్ని నా వెనక ఎంత మంది ఉన్నారో చూసావుగా జరిగే సమస్యే లేదు ఏమి అంటారు మామ” అని వెనక్కి తిరిగా అందరు మాయం ఎదవలు పసుపు గిన్నెలు చూసి మెల్లగా ఒక్కొక్కడు జారుకున్నారు అందుకేనా ఈ కొప్పులన్ని పక పక నవ్వాయి … ఇటు తిరిగితే పెద్ద పసుపు గిన్నె పట్టుకొని తెలంగాణా శకుంతల పోజ్ లో బండది ఇప్పుడు ఎక్కువ గెలికితే ఆ పసుపు నా మీద పడటం కాయం సైలెంట్ గ తప్పుకోవడం మంచిది అనుకోని “జాగ్రత్త చెల్లెమ్మ వెళ్ళు” అని దారి ఇవ్వబోయా.. ఏంటి చెల్లెమ్మ అని కొత్తగా అని అడిగింది … చీర వేసుకున్నావు కదా చెల్లెమ్మ అని పిలిచా అది డ్రెస్ వేసుకునింటే పాప అని పిలిచేవాన్ని … ఇంతలో వర్ష “భరత్ బయపడ్డాడు, సింహం పిల్లి అయింది” అని అరిచి తన చేత్తో కొంచం పసుపు తీసుకొని నా మొహానికి రాసింది అలా టచ్ చేయగానే బ్రెయిన్ లో హార్ట్ లో ఫ్యూజ్ లు అన్నిఎగిరిపోయాయి … అందరు అమ్మాయిలు కొంచెం కొంచెం గా నాకు రాసి అభి గాడి దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకా ఆ మత్తులోనే ఉన్న నేను ఇవేమీ పట్టించుకోలేదు ఇంతలో ఒక చిటిక వినపడింది అటుగా తిరిగా బండది ఒక చిన్న రాక్షస నవ్వుతో తన చేతిలో ఉన్న గిన్నె మొత్తం తల మీద కొట్టింది …. పెళ్లి మండపం అంతా నవ్వులు ….
అప్పుడు తేరుకున్న నా టీ షర్టు గోవింద గోవింద కోపం తో నా మీద ఉన్న కొంచెం పసుపు తీసుకొని బండదానికి కొంచెం అంటించాను అది తోసింది నన్ను కాలు తట్టుకొని కింద పడిపోతుంటే వర్ష రెండు చేతులు అడ్డం పెట్టి పట్టుకుంది ఆ రొమాంటిక్ యాంగిల్ లో కళ్ళు కళ్ళు కలుసుకునే లోపల బండది వచ్చి వర్షను లాగేసింది అంతే దెబ్బకు నడ్డి విరిగి ముడ్డి చినిగింది… "అబ్బా" ఆ బండది నవ్వుతు ఇంకా లేచి వెళ్లి కాపడం పెట్టించుకో పో అని అనింది.. లేచి అన్ని మూసుకొని మా ఘోష రాముడు చెప్పింది విననందుకు నన్ను నేను తిట్టికుంటూ వెళ్ళాను రూం కి … బాగా ఫ్రెష్ అప్ అయ్యాక కొత్త పెళ్లి కొడుకు లాగ మెరిసిపోతున్న మంచి డ్రెస్ వేసుకొని మళ్లీ మండపం లోకి వచ్చాను అందరు డైనింగ్ హాల్ లో తింటున్నారు… అభి నందిని తప్ప అందరు ఇక్కడే చచ్చారు వెళ్లి అనిల్ గాన్ని “ఏరా మావా ఏంటి స్పెషల్ ఆకలి దంచేస్తుంది“ అని అడిగా అక్కడే ఉన్న బండది గడ్డి అని సమాధానమిచ్చింది వెంటనే నేను “ నువ్వు తినేది కాదక్క మేము తినే పదార్థాలు గురించి అడిగా, నువ్వు తిను రేయ్ అక్కకి రెండు మోపుల పచ్చ గడ్డి అని కేక వేసా”… వర్ష ఫుల్ గా నవ్వుతు ఎంజాయ్ చేస్తోంది తను కొత్త పెళ్లి కూతురిల మెరిసి పోతోంది నేను తను ఎదురుగా కూర్చున్న చూపులు చూపులు కలుస్తున్నాయి ఒక చిన్న స్మైల్ ఇస్తూ మళ్లీ పట్టించుకోనట్టుగా పక్కన చూస్తూ మాట్లాడుతున్నాం… ఎందుకో తన వైపు తిరిగాను తను నన్నే చూస్తోంది నేను చూడగానే కళ్ళు తిప్పుకుంది …. మళ్ళీ బండది “రేయ్ మూసుకొని నీ ప్లేట్ వంక చూస్తూ తినరా, అమ్మాయిలను చూడకుండా సొల్లు కార్చకుండా సైట్ కొట్టకుండా ఉండలేరా రా మీ అబ్బాయిలు” అనింది… ఇది కచ్చితంగా నా ఆత్మ రాముడు లవర్ కాని పెళ్ళాం కాని అయుంటుంది లాస్ట్ జన్మలో అందుకే ఈ జన్మలో వాడిలాగా నన్ను బాగా హింస పెడుతోంది .. “అమ్మాయిలు ఫీల్ కానప్పుడు నీకు ఎందుకు అక్క మూసుకొని నీ గడ్డి తిను కావాలంటే కుడితి కూడా తెప్పిస్తా రేయ్ అక్కకి వేడి వేడి కుడితి ఒక బకెట్ లో తీసుకొని రండి రా”… వర్ష తో పాటు అందరు గట్టిగ నవ్వారు మొహం మాడ్చుకునింది చాల ఓవర్ చేసాను అనిపించింది తరువాత సారీ చెప్దాం అనుకున్న... తినడం పూర్తి అయ్యాక చేయి కడుక్కుంటూ ఉంటె పక్కన వచ్చి చేయి కడుక్కుంటుంది వర్ష “థాంక్స్ ఈ మ్యారేజ్ చాల గుర్తుండి పోతుంది నా లైఫ్ లో చాల సంతోషంగా ఉన్న మనస్పూర్తిగా నవ్వాను నిన్న రాత్రి పడుకునంత త్రుప్తిగా ఈ మధ్య కాలం లో ఎప్పుడు లేదు” అని చిన్న కన్నీటి బొట్టు కల్లలో నా గుండె గుచ్చుకుంది ఎందుకు బాధ పడుతోంది అని ఆలోచిస్తూ ఉండగానే ఫ్రెండ్స్ అందరు అభి గాడికి పంచ కట్టించాలి అని తీసుకెళ్ళారు రూం కి….
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







