అలెర్ట్: 15 కీలక ప్రాంతాలలో అనుదాడులకు కిమ్ ప్లాన్

- November 24, 2017 , by Maagulf
అలెర్ట్: 15 కీలక ప్రాంతాలలో అనుదాడులకు కిమ్ ప్లాన్

ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ప్రపంచంలోని 15 ప్రాంతాలను లక్ష్యంగా అణు దాడులు జరపాలని ప్లాన్ చేశారని నివేదికలు బట్టబయలయ్యాయి. ఈ విషయం వెలుగు చూడడంతో ప్రపంచదేశాలు నివ్వెరపోయాయి. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ రెండు మాసాలుగా ఎలాంటి కవ్వింపుచర్యలకు పాల్పడడం లేదని వార్తలు వచ్చిన వారం రోజులకే అణుదాడులకు సంబంధించి కిమ్ రూపొందించిన ప్లాన్ బట్టబయలు కావడం ఆందోళన కల్గించేదిగా ఉంది. ఉత్తరకొరియా చీఫ్ కిమ్ జంగ్ ఉన్ వ్యవహరిస్తున్న తీరుపై ఐక్యరాజ్యసమితితో పాటు పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలోనే ఉత్తరకొరియాపై ఆంక్షలను విధించారు.

ప్రపంచంలోని 15 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని అణు దాడులు చేయాలని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ అణుదాడులకు పాల్పడాలని ప్లాన్ చేశారని నివేదికలు బట్టబయలయ్యాయి. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌, గ్వామ్‌ ద్వీపాలే లక్ష్యంగా ఉత్తర కొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ అణు బాంబులు విసిరేందుకు సిద్ధమయ్యారనే రిపోర్టులు వస్తున్నాయి. ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రకటనలను పలుమార్లు నిశితంగా పరిశీలించిన తర్వాతే ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు చెప్పింది.

ఉత్తరకొరియా ఎంచుకున్న ప్రదేశాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోకొంత గుర్తింపు కలిగినవేనని తెలిపింది. ఉత్తరకొరియా అధికారిక మీడియా సంస్థలో ఉన్న సోర్సెస్‌ సాయంతో ఈ సమాచారం సంపాదించగలిగినట్లు యూరోపియన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఫారిన్‌ రిలేషన్స్‌(ఈయూఎఫ్‌ఆర్‌) వివరించింది. అమెరికాలోని వైట్‌హౌస్‌, పెంటగాన్‌, న్యూయార్క్‌, మన్‌హట్టన్‌తో పాటు అమెరికా ముఖ్య నగరాలలో అణుదాడులకు పాల్పడే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. జపాన్‌లోనిమిసావా, టొక్యో, ఒసాకా, యోకోహామా, క్యోటో నగరాలపై దాడులు చేయాలని ఉత్తరకొరియా ప్లాన్ చేసింది.దక్షిణ కొరియాలోని సియోల్‌, బుసాన్‌, గ్యాంన్నెయంగ్‌ ప్రాంతాల్లో కిమ్ జంగ్ ఉన్ దాడులు చేసే అవకాశం ఉందని ఈ నివేదిక అవకాశం ఉందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com