ఇండియాలో మళ్ళీ ఐటీ గండం
- November 24, 2017
ఇప్పటికే వరుస ఎదురుదెబ్బలతో చిత్తడైపోతున్న ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ నెత్తిన మరో 'తాటికాయ' పడింది. ఏకంగా పదివేల కోట్ల మేర సర్వీస్ ట్యాక్స్ భారం ఒక్కసారిగా మొయ్యాల్సి వస్తోంది. గత ఐదేళ్ళలో విదేశాలకు సాఫ్ట్ వేర్ ఎక్స్ పోర్ట్ చేసి.. తద్వారా పొందిన ప్రయోజనాల రిటర్న్స్ దాఖలు చేయాల్సిందిగా ఇండియాలోని ఐటీ కంపెనీలకు నోటీసులందాయి. ఆలస్యం చేసినందుకు జరిమానాతో కలిపి మొత్తం 15 శాతం సర్వీస్ టాక్స్ కట్టాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నాయి ఆ నోటీసులు. విదేశాలకు ఐటీ సర్వీసులు అందించడమంటే.. ఇక్కడ అందుబాటులో వున్న వస్తువుల్ని విదేశీ కస్టమర్లకు అమ్ముకున్నట్లేనని.. ప్రత్యక్ష పన్నుల శాఖ చెబుతోంది. తాజా నోటీసులతో ఇండియాలోని 200 ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు నష్టపోనున్నాయి. దీని ప్రభావం రిక్రూట్ మెంట్ మీద పడే ప్రమాదం ఉందని నిరుద్యోగ వర్గాల్లో గుబులు మొదలైంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







