29 ఉదయం నుంచి మెట్రో సర్వీసులు : మంత్రి కేటీఆర్
- November 25, 2017
హైదరాబాద్: నగరంలో మెట్రో రైలు ప్రారంభానికి సిద్ధమైంది. 28వ తేదీ మధ్యాహ్నం 2-15 గంటలకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి మెట్రో రైలు ప్రారంభిస్తారు. మెట్రో ప్రారంభమయ్యే ప్రాంతాలను మంత్రి కేటీఆర్ శుక్రవారం పరిశీలించారు. ప్రజా ప్రతినిధులతో కలిసి నాగోల్ నుంచి ట్రయల్ రన్ చేశారు. ఇవాళ రాత్రి మెట్రో చార్జీలను మంత్రి ప్రకటిస్తారు. 29వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మెట్రో సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ప్రతి రోజు రాత్రి 10 గంటల వరకు ప్రయాణిస్తాయి. ప్రస్తుతానికి 57 మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో రైలుకు 3 బోగీలు ఉంటాయి. ఒక్కో బోగీలో 330 మంది ప్రయాణించవచ్చు. అవసరమైతే ఈ బోగీల సంఖ్యను పెంచుతామని అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







