మొబల్‌ యాప్‌ని ప్రారంభించిన ఇండియన్‌ స్కూల్‌ అల్‌ గుబ్రా

- November 25, 2017 , by Maagulf
మొబల్‌ యాప్‌ని ప్రారంభించిన ఇండియన్‌ స్కూల్‌ అల్‌ గుబ్రా

మస్కట్‌: ఇండియన్‌ స్కూల్‌ అల్‌ గుబ్రా, ఐఎస్‌జి మొబైల్‌ యాప్‌ని ప్రారంభించింది. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ప్రెసిడెంట్‌ అహ్మద్‌ రయీస్‌ ఈ మొబైల్‌ యాప్‌ని ప్రారంభించారు. స్కూల్‌తో విద్యార్థుల తల్లిదండ్రులు కమ్యూనికేట్‌ చేయడానికి వీలుగా ఈ యాప్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు అహ్మద్‌ రయీస్‌ చెప్పారు. పేపర్‌ వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఎకో ఫ్రెండ్లీకి మద్దతిచ్చేలా ఈ యాప్‌ని ఉపయోగించనున్నట్లు అహ్మద్‌ రయీస్‌ వివరించారు. సర్కులర్లు, ముఖ్యమైన సమాచారాన్ని పేరెంట్స్‌కి పంపడానికి ఈ యాప్‌ ఎంతో ఉపకరించనుంది. ఫీజుల చెల్లింపు, రిపోర్డ్‌ కార్డ్‌ చూసుకోవడం, పలు ఈవెంట్లకు సంబంధించిన విషయాలూ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫీచర్స్‌తో యాప్‌ని అద్భుతంగా రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. మిడిల్‌ ఈస్ట్‌ ఐటీ సిస్టమ్స్‌ ఈ వ్యాప్‌ని రూపొందించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com