ఆలూ చికెన్ బిర్యానీ
- November 25, 2017
కావలసిన వస్తువులు
చికెన్: అరకిలో. సగం ఉడికిన అన్నం: ఒకటిన్నర కిలో, ఆలు: నాలుగు లేదా ఐదు(కావలసిన సైజులో ముక్కలు చేసుకోవాలి), దాల్చిన చెక్క: చిన్న ముక్క, యాలకులు: నాలుగు లేక ఐదు, మిరియాలు: కొన్ని, బిర్యానీ ఆకు: కొద్దిగా, పచ్చిమిర్చి: ఎనిమిది, ఉల్లిపాయ ముక్కలు: రెండు కప్పులు, కారం: సరిపడ, నిమ్మరసం: టేబుల్ స్పూను, కొత్తిమీర ఆకులు: కప్పు, కుంకుమపువ్వు: కొద్దిగా, ఉప్పు: రుచికి సరిపడ, నూనె: తగినంత, అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు స్పూన్లు
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని సగం ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఓ పెద్ద గిన్నెలో చికెన్ ముక్కలు, కారం, ఉప్పు, నిమ్మరసం, చిటికెడు పసుపువేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ లేదా పాన్‌లో నూనె వేసి బంగాళాదుంప ముక్కలను కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో పచ్చిమిరపకాయలు, దాల్చినచెక్క, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి దోరగా వేయించుకోవాలి. వీటికి ఉల్లిపాయ ముక్కలు జతచేర్చి మరికొద్దిసేపు వేయించి అనంతరం అల్లం వెల్లుల్లిముద్ద కూడా జతచేయాలి. అన్నీ వేగిన తరువాత చికెన్ ముక్కలు వేసి మరికొద్ది సేపు వేయించి చివరగా బంగాళాదుంప ముక్కలు జతచేయాలి. ఉడికిన అన్నాన్ని రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగం మీద వేయించి పెట్టుకున్న మిశ్రమంలో సగభాగాన్ని తీసుకుని లేయర్‌గా పరుచుకోవాలి. దానిపైన మిగతా అన్నం వేసి మిగతా కూరను కూడా పరిచి కుక్కర్‌లో ఒకటి లేదా రెండు విజిల్స్ మాత్రమే వచ్చేవరకు ఉంచి దింపేయాలి. చివరగా కొత్తిమీర చల్లుకోవాలి.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా