ఇవాంకా సదస్సులో ప్రసంగించనున్న చెర్రీ
- November 25, 2017
హైదరాబాద్: సినీ నటుడు రాంచరణ్ అరుదైన అవకాశం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో రాంచరణ్ ప్రసంగించనున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఇవాంక ట్రంప్ రానుంది. ఈ సందర్భంగా ఆమె ఈ సదస్సునుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇవాంకతో పాటుగా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, సానియామీర్జా, గోపీచంద్, మిథాలీరాజ్, గవాస్కర్, మానుషి చిల్లర్, సోనమ్ కపూర్, అదితిరావులు ఈ సదస్సులో తమ సందేశాలివ్వనున్నారు.
ప్రప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుతో తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ పెట్టుబడుల విషయంలో మరింత ప్రాధాన్యం లభిస్తుందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ అన్నారు. ''పెట్టుబడుల విషయంలో ఇతర మెట్రో నగరాల ఏకఛత్రాధిపత్యానికి గండిపడి భారీస్థాయి పెట్టుబడిదారులు హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి వాళ్లకు కూడా అంతర్జాతీయ ధోరణులు అర్థం చేసుకొనే అవకాశం ఏర్పడుతుంది'' అని మీడియాతో జయేశ్‌రంజన్ చెప్పిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు మూడు కొత్త బస్సు మార్గాలు







