బట్టతలకు చెక్ పెట్టే నెయ్యి..
- November 25, 2017
జుట్టు చివర్లో చిట్లుతున్నాయా? అయితే నెయ్యిని ఇలా వాడండి అంటున్నారు బ్యూటీషియన్లు. నెయ్యిని ఓ బౌల్‌లో తీసుకుని దాన్ని జుట్టు చివర్లలో రాయాలి. 20 నిమిషాల తర్వాత దువ్వెనతో దువ్వేసుకుని.. ఆపై మైల్డ్ షాంపూతో కడిగేస్తే మంచి ఫలితం వుంటుంది. అలాగే చుండ్రుకు చెక్ పెట్టడంలోనూ నెయ్యి భేష్‌గా పనిచేస్తుంది.
గోరువెచ్చని నెయ్యికి బాదం నూనె కలిపి కురుల మొదళ్లలో రాసుకుని 20 నిమిషాల పాటు వుంచాలి. తర్వాత నూనె పోయేలా రోజ్ వాటర్‌తో శిరోజాలను కడిగేయాలి. నెలకు రెండు సార్లు ఇలా చేసి చూస్తే మంచి ఫలితం వుంటుందని బ్యూటీషియన్లు అంటున్నారు.
అలాగే నెయ్యి శిరోజాలకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. మూడు చెంచాల నెయ్యిని ఆలివ్ ఆయిల్‌తో కలిపి వెంట్రులకు రాసుకుని అరగంట పాటు వుంచి.. ఆపై మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే కురులు నిగనిగలాడుతాయి. బట్టతల నుంచి తప్పించుకోవాలంటే.. మాసానికి ఓసారి నెయ్యిని కురులకు పట్టించడం చేయాలి.
ఐదు స్పూన్ల నెయ్యికి పది బాదం పలుకులు కలిపి వేడి చేసి అవి నలుపుగా మారాక వాటిని నెయ్యి నుంచి తొలగించాలి. ఆ నూనెను మాడుకు పట్టించాలి. మూడు గంటలకు తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. మైల్డ్ షాంపును ఉపయోగించడం మరువకూడదు. ఇలా చేస్తే బట్టతల సమస్యను దూరం చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







