దుబాయ్ ప్రయాణమవ్వనున్న బాలకృష్ణ-నయన్ జోడీ
- November 26, 2017
నందమూరి నటసింహం బాలకృష్ణ చేస్తున్న కొత్త సినిమా కోసం బాలయ్యతో పాటుగా నయనతార దుబాయ్ వెళ్లనుందట. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య 102వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం 'జై సింహా'. చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార, నటాషా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సికే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ మాత్రమే పెండింగ్‌లో ఉంది.
అయితే ఈ షెడ్యూల్‌ను దుబాయ్‌లో ప్లాన్ చేసింది చిత్రయూనిట్. డిసెంబర్ 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు దుబాయ్‌లో ఈ షెడ్యూల్ జరగనుంది. అక్కడ బాలకృష్ణ-నయనతార లపై ఓ పాటను, బాలకృష్ణ- నటాషా లపై మరో పాటను చిత్రీకరించనున్నారు. ఈ రెండు పాటల షూటింగ్ పూర్తయితే షూటింగ్ అంతా పూర్తయినట్లే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 12న విడుదలకానుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







