రాజీనామా చేసిన పాకిస్ధాన్ మంత్రి...నిరసనను నిలిపివేసిన ఆందోళనకారులు
- November 27, 2017
ఇస్లామాబాద్: పాకిస్థాన్ న్యాయశాఖ మంత్రి జాహిద్ హమిద్ ఇవాళ రాజీనామా చేశారు. దీంతో ఇస్లామిక్ ఆందోళనకారులు తమ నిరసనను నిలిపేశారు. హైవే రోడ్లను స్తంభింపచేస్తూ గత కొన్ని రోజులుగా ఇస్లామిక్ అతివాదులు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. దైవ దూషణకు పాల్పడిన మంత్రి హమిద్‌ను వెంటనే తప్పించాలని ఇస్లామిక్‌వాదులు ఆందోళన నిర్వహించారు. రాజధాని ఇస్లామాబాద్‌కు కనక్ట్ చేసే రహదారులన్నీ మూసివేశారు. అయితే శనివారం జరిగిన హింసలో సుమారు ఆరు మంది మృతిచెందారు. 200 మంది గాయపడ్డారు. లాహోర్, పెషావర్, కరాచీల్లో భారీ స్థాయిలో ఆందోళనలు జరిగాయి. శనివారం జరిగిన హింసను కవర్ చేయకుండా ఉండేందుకు కొన్ని ప్రైవేటు ఛానళ్లను, సోషల్ మీడియాను ప్రభుత్వం రద్దు చేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







