కేంద్రం: పలు పథకాలపై ఆధార్ లింకేజ్ గడువు పెంపు
- November 27, 2017
న్యూఢిల్లీ: బ్యాంక్ ఖాతాదారులు, మొబైల్ సబ్‌స్క్రైబర్లకు తమ ఖాతాలతో ఆధార్ అనుసంధానానికి సంబంధించి ఊరట లభించనుంది. రాజ్యాంగ ధర్మాసనం ఎదుట కేంద్రం, ఢిల్లీ సర్కార్‌ల వివాదానికి సంబంధించిన విచారణ ముగిసిన తర్వాత వివిధ సంక్షేమ పథకాలకు ఆధార్ అనివార్యతపై విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు పలు పథకాలపై ఆధార్ లింకేజ్ గడువును వచ్చే ఏడాది మార్చి 31వరకూ పొడిగించేందుకు సిద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు కేంద్రం నివేదించింది.
రాజ్యాంగ ధర్మాసనం మాత్రమే ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుందని జస్టిస్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ పేర్కొంది. ఇప్పటివరకూ కస్టమర్లు తమ బ్యాంక్ ఖాతాలకు డిసెంబర్ 31లోగా ఆధార్‌ను లింక్ చేయాల్సి ఉండగా, మొబైల్ నెంబర్లకు ఫిబ్రవరి 6లోగా ఆధార్ లింకేజ్‌ను పూర్తిచేయాల్సి ఉంది. తాజాగా మార్చి 31వరకూ వీటి డెడ్‌లైన్‌ను సుప్రీం అనుమతితో కేంద్రం పొడిగించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







