తెలంగాణ NRI డిపార్ట్మెంట్:ఇవంకా స్వాగత పనుల్లో బిజీగా ఉన్నా గల్ఫ్ బాధితుడికి కూడా ప్రాధాన్యం

- November 27, 2017 , by Maagulf
తెలంగాణ NRI డిపార్ట్మెంట్:ఇవంకా స్వాగత పనుల్లో బిజీగా ఉన్నా గల్ఫ్ బాధితుడికి కూడా ప్రాధాన్యం

బహ్రెయిన్: బహ్రెయిన్ లో మెడికల్ ఫెయిలై ఇంటికి వస్తున్న గల్ఫ్ కార్మికుడు బత్తిని రాజేశ్వర్ ఆత్మహత్యే శరణ్యం అని వాయిస్ మెసేజ్ పెట్టాడు. 28 నవంబర్ తెల్లవారు జామున 1.45am కు ఓమాన్ ఏర్ వేస్ ప్లయిట్ నెంబర్ WY-239 ద్వారా బహ్రెయిన్ (వయా మస్కట్) నుండి హైదరాబాద్ కు చేరుకుంటున్నాడు. 

బత్తిని రాజేశ్వర్ బహ్రెయిన్  నుండి..  ఇవంకా ట్రంప్ అమెరికా నుండి దాదాపు ఒకే టైంలో హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇద్దరికీ తెలంగాణ ప్రోటోకాల్ అధికారులు స్వాగతం పలుకుతున్నారు. ఇతను స్వగ్రామం చేరుకోవడానికి తెలంగాణ ఎన్నారై డిపార్టుమెంట్ వారు బస్ చార్జీలు ఇచ్చి, ఆర్మూర్ బస్ ఎక్కిస్తారు. 

నిజామాబాద్ జిల్లా ముప్కల్ మండలం కొత్తపల్లి కి చెందిన బత్తిని రాజేశ్వర్ (41) ఈనెల 16న బహ్రెయిన్
దేశం చేరుకున్నాడు. అక్కడ వైద్య పరీక్షలలో విఫలం (మెడికల్ అన్ ఫిట్) కావడం వలన స్వదేశానికి తిప్పి పంపుతున్నారు. స్వదేశానికి వచ్చినంక తెలంగాణ అసెంబ్లీ ముందు ఆత్మహత్య చేసుకుంటానని వాయిస్ మెసేజ్ పెట్టాడు. కాగా జి.సి.సి (గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్) మెడికల్ సెంటర్స్ అసోసియేషన్ (గమ్కా) గుర్తింపు పొందిన హైదరాబాద్ లోని ప్రీతి డయాగ్నోస్టిక్ సెంటర్ లో జులై 20న నిర్వహించిన వైద్య పరీక్షలలో ఇతనికి 'ఫిట్' సర్టిఫ్జికెట్ ఇచ్చారు. నాలుగు నెలలలోనే 'అన్ ఫిట్' కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

బత్తిని రాజేశ్వర్, బహ్రెయిన్ మొబైల్: +973 3533 2457 భార్య సరిత సెల్: +91 95537 07193

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com