బ్రెడ్‌ షాహి

- November 27, 2017 , by Maagulf
బ్రెడ్‌ షాహి

కావలసినవి:
బ్రెడ్‌ ప్యాకెట్‌ ఒకటి, పచ్చి కోవా 150 గ్రా., చక్కెర 600 గ్రా., పాలు ఒక లీటరు, నీళ్లు ఒక లీటరు, కుంకుమపువ్వు ఒక గ్రా., నూనె తగినంత, జీడిపప్పు, కిస్‌మిస్‌, బాదం పప్పులు, పిస్తా పప్పులు కొద్దిగా.

ఎలా చేయాలి:
బ్రెడ్‌ ముక్కల్ని రెండేసి ముక్కలుగా కట్‌ చేసి పక్కన పెట్టుకోవాలి. నీళ్లలో చక్కెర, కుంకుమపువ్వు వేసి బాగా కలిపి వేడి చేయాలి. లేత పాకంలా వచ్చాక కిందికి దించాలి. బాణలిలో నూనెని వేడి చేసి బ్రెడ్‌ ముక్కల్ని వేగించి వాటిని చక్కెర పాకంలో వేయాలి. తర్వాత మరిగించిన పాలలో పచ్చి కోవాను బాగా కలిపి వెడల్పాటి గిన్నెలో ఆ మిశ్రమాన్ని పోయాలి. పైన బ్రెడ్‌ ముక్కల్ని పేర్చి మిగిలిన చక్కెర పాకాన్ని కూడా వాటిపై పోయాలి. పప్పులన్నిటిని కట్‌ చేసి పైన అలంకరించాలి. సన్నని మంట మీద ఈ గిన్నెని పెట్టి చక్కెర పాకం గట్టిపడిన తర్వాత కిందికి దించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com