హైదరాబాద్‌లో ఇవాంకా..గ్రాండ్ వెల్‌కమ్
- November 27, 2017అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, వైట్‌హౌస్ సలహాదారు ఇవాంకా హైదరాబాద్‌కి చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకి చేరుకున్న ఆమెకు తెలంగాణ మంత్రులు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనంలో మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత మూడు గంటలకు హెచ్ఐసీసీకి చేరుకుని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో భేటీకానున్నారు.
అలాగే ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని మోదీ మెట్రో రైలును ప్రారంభించిన అనంతరం హెచ్ఐసీసీ వేదిక వద్దకు చేరుకుంటారు.
అక్కడ మోదీని ఇవాంక మర్యాదపూర్వకంగా కలుస్తారు. పారిశ్రామికవేత్తల సదస్సు తర్వాత ఇద్దరూ కలిసి ఫలక్‌నుమా ప్యాలెస్ చేరుకుంటారు. విందు అనంతరం రాత్రి 10.45 గంటలకు ఇవాంకా తిరిగి ట్రైడెంట్ హోటల్‌కు చేరుకుంటారు. ఇవాంకా రాక సందర్భంగా హైటెక్ సిటీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్‌గాన్ పిల్స్ సీజ్..!!