మోడీ హైదరాబాద్ పర్యటన వివరాలు
- November 27, 2017
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. మోదీ నేటి మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అటునుంచి మధ్యాహ్నం 2.05 గంటలకు మియాపూర్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2.23కి మెట్రో పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన ఆడియో విజువల్ దృశ్యమాలికను తిలకిస్తారు. మెట్రో రైలు బ్రోచర్, యాప్‌ను విడుదల చేస్తారు. మియాపూర్-కూకట్పల్లి-మియాపూర్ వరకు మెట్రో రైలులో ప్రయాణిస్తారు. మధ్యాహ్నం 3.15 గంటలకు హెచ్ఐసీసీ చేరుకుంటారు. 3.35 నుంచి 3.55 వరకు 20 నిమిషాల పాటు ఇవాంకా ట్రంప్‌తో ప్రధాని భేటీకానున్నారు. 4 నుంచి 4.25 గంటల వరకు భారత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రధాని మోదీని కలుస్తారు. అనంతరం 4.43 గంటలకు అధికారికంగా జీఈఎస్ సదస్సు ప్రారంభం కానుంది. 4.45 నుంచి 4.50 వరకు ఇవాంకా ఉపన్యాసం ఇస్తారు. 4.50 నుంచి 5.10 వరకు ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
ఆ తర్వాత కృతజ్ఞతలు తెలుపుతూ కేంద్రమంత్రి సుష్మా ప్రసంగం ఉంటుంది. సా.5.30-5.48 వరకు మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల బృందాలతో ప్రధాని మోదీ సమావేశమవుతారు. 5.56 నుంచి 6.03 వరకు గ్రూప్ మీటింగ్‌కు ప్రధాని హాజరవుతారు. 6.03-6.32 వరకు నలుగురు పారిశ్రామిక దిగ్గజాలతో మోదీ భేటీ కానున్నారు.
6.32- 7గంటల వరకు రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్ బయల్దేరుతారు. 8 నుంచి 10 వరకు అక్కడే ఉంటారు. రాత్రి 8.05-8.20 వరకు ట్రీ ఆఫ్ లైఫ్ పేరుతో ఫలక్‌నుమా ప్యాలెస్‌లో భారతీయకళలు, దుస్తుల ప్రదర్శన ఉంటుంది.
8.20 నుంచి 8.35 వరకు భారత చారిత్రక వారసత్వంపై లైవ్ షో ప్రదర్శిస్తారు. 8.45 నుంచి 9.50 వరకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటుచేసిన విందులో ప్రధాని పాల్గొంటారు అటుతరువాత 10.25 గంటలకు ప్రధాని మోదీ ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







