ప్రిన్స్ హ్యారీ ఒక ఇంటివాడు కానున్నాడు
- November 27, 2017
బ్రిటన్ యువరాజు హ్యారీ ఓ ఇంటివాడు కానున్నాడు. హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్‌ని ప్రేమించాడు.. ఆపై పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. ఇదే విషయాన్ని హ్యారీ తండ్రి ఛార్లెస్ అధికారికంగా ప్రకటించారు. నవంబర్ ఫస్ట్ వీక్‌లో ప్రిన్స్ హ్యారీ- మేఘన్‌ల ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అధికారిక భవనం క్లారెన్స్ హౌస్ వెల్లడించింది. 2018లో వీళ్ల మ్యారేజ్ జరగనుంది. త్వరలో పెళ్లి డేట్‌పై ఓ ప్రకటన రానుంది. పెళ్లి తర్వాత హ్యారీ దంపతులు కెన్సింగ్టన్ ప్యాలెస్‌లోని నాటింగ్‌హమ్ కాటేజ్‌లో ఉంటారని ఛార్లెస్ ఆఫీస్ తెలిపింది.
ఇక మేఘన్ విషయానికొస్తే.. హ్యారీ కంటే మూడేళ్లు పెద్దది. అంతేకాదు ఆమెకి ఇదివరకే వివాహమైంది. ఇంగెల్సన్‌తో మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకుంది. ఈ క్రమంలోనే గతేడాది ఓ సినిమా షూటింగ్ సందర్భంగా హ్యారీ- మేఘన్‌ల మధ్య ఏర్పడిన రిలేషన్ షిప్ కాస్త ప్రేమగా మారడం, ఆపై పెళ్లికి దారితీసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







