మెట్రోలో మోడీ ప్రయాణం, కేటీఆర్‌తో ముచ్చట్లు
- November 28, 2017
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మియాపూర్‌లో హైదరాబాద్ మెట్రో రైలును ఆవిష్కరించారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయం నుంచి మియాపూర్ చేరుకున్న మోడీకి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తదితరులు స్వాగతం పలికారు.
అనంతరం మెట్రో పైలాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మెట్రో రైలు బ్రోచర్, యాప్ విడుదల చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టు డాక్యుమెంటరీని సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ తదితరులతో కలిసి ప్రధాని మోడీ వీక్షించారు. మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వరకు మెట్రోలో ప్రయాణించారు.
1) మెట్రోలో మోడీ వెంట వీరే
ప్రధాని నరేంద్ర మోడీ మెట్రోలో ప్రయాణించే సమయంలో ఆయన వెంట సీఎం కేసీఆర్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్, బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఎల్ అండ్ టి అధికారులు ఉన్నారు.
2) కేటీఆర్ చెబుతుంటే ఆసక్తిగా విన్న మోడీ
ప్రధాని మోడీకి ఓ పక్కన మంత్రి కేటీఆర్ కూర్చున్నారు. ప్రయాణించేటప్పుడు కేటీఆర్ ఆయనకు ఏదో చెబుతున్నారు. మోడీ కూడా బయటకు చూస్తూ ఆసక్తిగా విన్నారు. మరోవైపు కేసీఆర్, నరసింహన్ కూర్చున్నారు. మోడీ మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వరకు, తిరిగి అక్కటి నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు.
3) మెట్రో రైలు నడిపిన మహిళా డ్రైవర్
ప్రధాని నరేంద్ర మోడీ, కేసీఆర్, నరసింహన్‌లు ప్రయాణించిన రైలును ఓ మహిళా డ్రైవర్ నడిపారు. తొలుత మియాపూర్ రైల్వే స్టేషన్ చేరుకున్న ప్రధాని మొదటి అంతస్తులో డాక్యుమెంటరీ వీక్షించారు. అనంతరం రెండో అంతస్తుకు వెళ్లి మెట్రో రైలు ఎక్కారు.
4) పైలాన్ ప్రారంభించారు
మెట్రో పైలాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మెట్రో రైలు బ్రోచర్, యాప్ విడుదల చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టు డాక్యుమెంటరీని సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ తదితరులతో కలిసి ప్రధాని మోడీ వీక్షించారు. మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వరకు మెట్రోలో ప్రయాణించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







