రజనీ కాంత్, కమల్ హాసన్ మధ్య తేడా ఇదే
- November 28, 2017
సినిమా ఇండస్ట్రీలో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ఈ మద్య రాజకీయ రంగంలోకి ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన కొత్త పార్టీ పెడతానని అనౌన్స్ కూడా చేశారు. వాస్తవానికి కొత్త పార్టీ ఆయన పుట్టిన రోజునే ప్రారంభించాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజకీయాలపై హాట్ టాపిక్ మారిన కమల్ హాసన్ తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు.
ఈ మద్య అభిమానులకు చేరువ అయ్యే విధంగా ఎన్నో కార్యక్రమాల్లో అభిమానులే దేవుళ్లంటూ ఊదరగొడుతున్న కమల్ హాసన్ ఓ అభిమాని చెంప చెల్లుమనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సాధారణంగా ఫ్యాన్స్ అనగానే తమ అభిమాన హీరోని కలవాలని ఎంతో ఉత్సాహ పడుతుంటారు..కానీ ఆ సమయంలో వారు స్పందించే తీరు మాత్రం చాలా కఠినంగా ఉంటుంది.
తాజాగా ఓ అభిమానిపై కమల్ హాసన్ చేయి చేసుకున్న వీడియో వైరల్ అవుతోంది. ఇందులో తనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చిన అభిమానిని కమల్ హాసన్ ఆవేశంతో బలంగా తోసేసినట్లు ఉంది. అభిమానిపై కమల్ హాసన్ వ్యవహరించిన తీరు పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులను ఎంతో ఆప్యాయంగా మందలిస్తుంటారు..ఇదే విషయాన్ని నెటిజన్లు వివరిస్తూ..రజనీ కాంత్, కమల్ హాసన్ మధ్య తేడా ఇదేనంటూ అంటున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష