మళ్ళీ తెరపైకి స్వామీజీ, నటి రాసలీలలు.. 10 మంది వేధింపులకు గురి చేసి జీవితం నాశనం చేశారంటున్న నటి

- November 28, 2017 , by Maagulf
మళ్ళీ తెరపైకి స్వామీజీ, నటి రాసలీలలు.. 10 మంది వేధింపులకు గురి చేసి జీవితం నాశనం చేశారంటున్న నటి

ఇటీవల బెంగళూరు శివారులోని యలహంక సమీపంలో హూణసమారణహళ్లి మద్దవేణపుర జంగమ మఠం కు చెందిన దయానంద స్వామీజీ సాండల్ వుడ్ నటి తో జరిపిన రాసలీలల వీడియో ఒకటి బయటకు వచ్చి హల్ చల్ చేసిన సంగతి విధితమే.. కాగా మళ్ళీ ఈ స్వామీజీ రాసలీల వ్యవహారం తెరపైకి వచ్చింది. ... రాసలీలల్లో ఉన్న నటి.. మంగళవారం (నవంబర్ 28వ తేదీన) ఓ వీడియోను మీడియాకు విడుదల చేసింది. తనను 10 మంది వేధింపులకు గురి చేసి బలిపశువును చేశారు.. నా జీవితం నాశనం చేసిన వారిని వదిలి పెట్టను.. అయితే తనకు ప్రాణహాని ఉంది.. కనుకనే మీడియా ముందుకు రాలేక పోతున్నా.. అందుకనే ఈ వీడియోను విడుదల చేస్తున్నట్లు ఆ నటి చెప్పింది. ప్రస్తుతం తనకు ఆరోగ్యం బాగోలేదు.. పైగా చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులు.. దీంతో తాను అజ్ఞాతంలో ఉన్నట్లు మీడియాకు రిలీజ్ చేసిన వీడియో లో ఉంది. మూడు నాలుగు రోజుల్లో బెంగళూరు వస్తానని సదరు నటి చెప్పింది. నన్ను వేధింపులకు గురి చేసినవారే.. ఆ వీడియో తీసి నా జీవితం నాశనం చేశారు.. నా పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు.. నన్ను ఇటువంటి స్థితికి తీసుకొచ్చిన వారిపై కేసు పెడతాను.. నేను ఆత్మహత్య యత్నం చేసిన సమయంలో కుటుంబ సభ్యులు అండగా నిలిచి.. చట్టపరంగా న్యాయ పోరాటం చేయమని చెప్పారు.. తాను బెంగళూరు వచ్చాక మీడియా సమావేశంలో అన్ని విషయాలను వెల్లడిస్తాను అని ఆ నటి చెప్పింది. దయానంద స్వామీజీ, సాండల్ వుడ్ నటి రాసలీలల వీడియో మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మఠం భక్తులు ఆందోళన చేయడంతో స్వామీజీని మఠం నుంచి శాశ్వతంగా బహిష్కరించారు. వీడియో ను తమ వద్ద ఉంచుకున్న కొంతమంది.. రూ.5 కోట్లకు డిమాండ్ చేయగా.. తాను రూ. 50 లక్షలు ఇచ్చినట్లు... అయినా సీడీ ని కావాలనే రిలీజ్ చేసి తనను ఈ స్టేజ్ కు తీసుకొచ్చారని ఇటీవల దయానంద స్వామీజీ ఆరోపించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com