కాస్మొడ్రోమ్ నుండి రష్యా రాకెట్ పయ్రోగం...
- November 28, 2017
వొస్తొచెనీ:ఇక్కడ నిర్మించిన కొత్త కాస్మొడ్రోమ్ (రోదసీ నౌకలను ప్రయోగించే ప్రాంతం) నుండి రష్యా రెండో రాకెట్‌ను మంగళవారం ప్రయోగించింది. గతేడాదే దీన్ని ప్రారంభించారు. కజకస్తాన్‌లోని బైకనూర్‌పై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని రష్యా భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రయోగం చోటు చేసుకుంది. వాతావరణ ఉపగ్రహాన్ని, ఇతర పరికరాలను తీసుకుని సోయుజ్ రాకెట్ మంగళవారం మధ్యాహ్నం 2.41గంటలకు రోదసీలోకి దూసుకెళ్ళింది. అనుకున్న ప్రకారమే తొలి దశలను విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు రష్యా రోదసీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. చైనా సరిహద్దుకు సమీపంలోని ఆమూర్ ప్రాంతంలో రాకెట్‌ను ప్రయోగిస్తున్న కార్యక్రమాన్ని జాతీయ టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. వాతావరణ ఉపగ్రహంతో పాటు కెనడా, అమెరికా, జపాన్, జర్మనీ, స్వీడన్, నార్వేలకు చెందిన కంపెనీలు, సంస్థల పరికరాలను కూడా రోదసీలోకి తీసుకెళ్ళింది. రష్యా తన రోదసీ పరిశ్రమను ఆధునీకరించుకోవడానికి ఇటువంటి కాంట్రాక్టులు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రధాని మెద్వెదెవ్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







