సన్నాఫ్ సత్యమూర్తి లో ఉపేంద్ర పాత్రపై మనసుపడ్డ హీరో రాజశేఖర్
- November 28, 2017
యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్............ చాలా కాలం తర్వాత గరుడ వేగ తో సూపర్ హిట్ అందుకొన్నాడు. ఈ నేపధ్యంలో రాజశేఖర్ కు ఒక ప్రశ్న ఎదురైంది.. ఇక పై మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు.. ఎటువంటి సినిమాలను చేయాలనుకుంటున్నారు అని..? రాజశేఖర్ ఈ ప్రశ్నకు బదులిస్తూ... ఇప్పటి నుంచి నా ఇమేజ్ కు తగని పాత్రాలను చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు.. ఒక పెద్ద హిట్ తర్వాత ఎవరైనా హీరోగానే చేయాలని భావిస్తారు.. కానీ నేను అలా కోరుకోవడం లేదు... "మంచి పాత్రలు.. డిఫరెంట్ విలన్ పాత్రలు, మల్టీ స్టారర్ సినిమాలు ఇలా ఏది వచ్చినా నటించడానికి నేను రెడీ అని చెప్పారు. ఈ తరం దర్శకులకు నేను అందుబాటులో ఉంటాను.. బన్నీ, త్రివిక్రమ్ ల సన్నాఫ్ సత్యమూర్తి లో ఉపేంద్ర పాత్ర నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఆ పాత్రలో నటించడానికి ముందుగా నన్నే అడగాలని అనుకున్నారట. కానీ ఎందుకనో నన్ను అడగలేదు.. ఒకవేళ ఆ పాత్ర నావద్దకు వస్తే.. ఖచ్చితంగా నేను చేసేవాడిని.. చాలా మంచి క్యారెక్టర్ అది.. అని రాజశేఖర్ తన మనసులో మాటను వెల్లడించారు. రాజశేఖర్ ఈ పాత్రలో చాలా బాగా నటించాడు.. అనిపించుకొనే పాత్రలు వస్తే నటించడానికి నేను ఎప్పుడూ రెడీనే అని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







