పవన్ అభిమానులకు ఈ వార్త నిజంగా పండగే
- November 29, 2017
ఇటు సినిమాలు, అటు రాజకీయాలతో బిజీ బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాత వాసి అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.మరో 15 రోజులలో షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే ఈ మూవీ తర్వాత తాను పూర్తి రాజకీయాలతోనే బిజీగా ఉంటాడని, 2019 వరకు మళ్ళీ ఏ సినిమా చేయడని పలు వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో ఆక్సీజన్ దర్శకుడు ఏఎం జ్యోతికృష్ణ( ఏఎం రత్నం తనయుడు) తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెగా అభిమానులకి తట్టుకోలేని ఆనందాన్ని అందించాడు.
2018 జనవరి నుండి పవన్ మరో సినిమా చేస్తాడని జ్యోతికృష్ణ అన్నారు. ఆర్ టీ నీసన్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రం ఏఎం రత్నం నిర్మాణంలో రూపొందనుంది. తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం వేదాళంకి రీమేక్‌గా ఈ మూవీ ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో పాటు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకొని సెట్స్ పైకి వెళ్లడానికి రెడీగా ఉంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ కూడా పవన్‌తో ఓ సినిమా చేయాలని భావిస్తున్నారు. కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు సమాచారం.
విజయ్ హీరోగా రూపొందిన థేరి సినిమాకి రీమేక్‌గా ఈ మూవీ ఉంటుందని టాక్. మరి పవన్ 26, 27 సినిమాలకు సంబంధించి పూర్తి డీటైల్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







