డిసెంబర్ 1 నుంచి ఇండీవుడ్ థర్డ్ ఎడిషన్
- November 29, 2017
హైదరాబాద్ : డిసెంబర్ 1 నుంచి 4 వరకు రామోజీ ఫిల్మ్‌సిటీలో ఇండీవుడ్ థర్డ్ ఎడిషన్ నిర్వహించనున్నట్లు చలన చిత్ర అభివృద్ధి మండలి ఛైర్మన్ రామ్మోహన్ రావు తెలిపారు. ఇండీవుడ్ థర్డ్ ఎడిషన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. ఈ ఎడిషన్‌కు సుమారు 50 వేల మంది ప్రతినిధులు హాజరవుతారన్న ఆయన.. 5 వేల మంది వ్యాపారవేత్తలు, 500 మంది పెట్టుబడిదారులు హాజరవుతారని చెప్పారు. 300 ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. గతేడాది ఫిలిం సిటీలో జరిగిన రెండో ఎడిషన్ ఇండీవుడ్ కార్నివాల్ విజయవంతమైందని రామ్మోహన్‌రావు గుర్తు చేశారు.
మూడో ఎడిషన్ మరింత పెద్ద ఎత్తున జరగబోతుందని రాష్ట్ర సమాచార కమిషనర్ నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సినిమాలు, సీరియళ్ల షూటింగ్ జరుగుతుందని తెలిపారు. గేమింగ్ వీఎస్‌ఎస్ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింతగా ప్రోత్సహిస్తుందని చెప్పారు. హైదరాబాద్ సినిమా రంగానికి రాజధానిగా మారబోతుందన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







