అమెరికా రావాలని కేటీఆర్ ను ఆహ్వానించిన ఇవాంక ట్రంప్

- November 29, 2017 , by Maagulf
అమెరికా రావాలని కేటీఆర్ ను ఆహ్వానించిన ఇవాంక ట్రంప్

రెండవ రోజు జీఈఎస్ సదస్సులో భాగంగా ఇవాళ ప్లీనరీ జరిగింది. దానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సమన్వయకర్త (మోడరేటర్)గా వ్యవహరించారు. ఈ ప్లీనరలో ప్యానలిస్టులుగా ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, ఇవాంకా ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ, డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్‌లు ఉన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ...

దక్షిణాసియాలోనే తొలిసారి హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు జరగడం సంతోషంగా ఉందన్నారు. అరుదుగా వచ్చిన ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్నామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల వివరణకు సరైన వేదిక ఇది అని చెప్పారు. ఈ రోజు మనకు ఈ అవకాశం రావడానికి ముఖ్య కారణం టీ హబ్ అని స్పష్టం చేశారు. టీ హబ్ వల్ల రాష్ర్టానికి అపార లబ్ధి చేకూరిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో పారిశ్రామిక విధానంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. అమెరికా రావాలని ఇవాంక ట్రంప్ ఆహ్వానించిందని చెప్పిన కేటీఆర్..

త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్తానని మంత్రి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com