చైనాకు చెక్ పెట్టే శక్తి ఒక్క భారత్కు మాత్రమే ఉంది
- December 01, 2017
న్యూఢిల్లీ : చైనాను అంతర్జాతీయంగా ఇప్పటికే పూర్తిగా ఇరుకున పెట్టిన భారత్.. తాజాగా మరో అడుగు ముదుకేసింది, డోక్లాం వివాదం తరువాత సిరహద్దుల్లో భారత్ భద్రతను కట్టు దిట్టం చేసింది. ఇప్పటివరకూ న్యూక్లియర్ సబ్ మెరైన్లపై పెద్దగా దృష్టిపెట్టని భారత్.. ఏక కాలంలో ఆరు న్యూక్లియర్ సబ్ మెరైన్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇదే విషయాన్ని నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా స్పష్టం చేశారు. భారత నేవీ సామర్థ్యాన్ని ఇవి పరిపుష్టం చేస్తాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా ఆధిపత్యాన్ని భారత్ సవాల్ చేయగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇండో-పసిఫిక్ రీజియన్లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాల చతుర్భుజ కూటమికి స్థిరమైన ఆకృతిని తీసుకురావడంలో నేవీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనాకు చెక్ పెట్టే శక్తి ఒక్క భారత్కు మాత్రమే ఉందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







