ఫ్రాన్స్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది
- November 16, 2015
పారిస్‌లో ఐఎస్ ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండతో రగిలిపోతున్న ఫ్రాన్స్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. దీనిలో భాగంగా సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై ఆదివారం రాత్రి బాంబుల వర్షం కురిపించింది. రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 120 మందికి పైగా అమాయక పౌరులు మృతిచెందారు.ఈ దాడులకు ప్రతీకారంగా ఆదివారం రాత్రి సిరియాలోని రక్కా నగరంపై ఫ్రాన్స్ వైమానిక దాడులకు పాల్పడింది. అమెరికా సహాయంతో 10 యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో స్థానిక ఐసిస్ కమాండ్ కేంద్రం, జిహాదీ శిక్షణా శిబిరం సహా ఫుట్‌బాల్‌స్టేడియం, మ్యూజియం ధ్వంసమయ్యాయి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







