ఫ్రిడ్జ్ లో బిడ్డ మృత దేహాన్ని పెట్టిన తల్లి..!!
- December 07, 2017
పొత్తిళ్లలో ఆడుకోవాల్సిన బిడ్డ మృతి చెందడమే ఆ తల్లి ని బాధ పెట్టేవిషయం అయితే.. మరణించిన బిడ్డకు మరణ ధృవీకరణ పత్రం తీసుకోవడానికి ఆ మృత శిశువును ఉంచమని వైద్యులు చెప్పడంతో.. ఆ తల్లి ఆ బిడ్డ శవాన్ని ఫ్రిజ్ లో పెట్టి దాచడం హృదయ విదారకరమైన సంఘటన.. ఈ ఘటన పేరూలో చోటు చేసుకొన్నది.
లిమాలో సెర్గియా బర్నెల్స్ హాస్పటల్ లో మోనికా పలోమినో అనే మహిళ శనివారం రాత్రి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ నెలలు నిండకుండా పుట్టిన ఈ శిశువు సోమవారం మరణించాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఆ మృత శిశువుని అక్కడ నుంచి వెంటనే తీసుకొని వెళ్ళాలి అని ఒత్తిడి చేశారు.. దీంతో తన బిడ్డ మరణ ధృవీకరణ పత్రం ఇస్తే.. వెళ్లిపోతామని ఆ తల్లి ఎంతగా ఆస్పత్రి సిబ్బందికి చెప్పినా వినిలేదు.. అంతేకాదు.. డేట్ సర్టిఫికేట్ ఇచ్చేవరకూ ఆ మృత శిశువు దేహాన్ని ఉంచాలని వైద్యులు చెప్పారు.. దీంతో మోనికా చేసేది ఏమీ లేక తన బిడ్డ మృత దేహాన్ని ఇంట్లో ఫ్రిజ్ లో పెట్టింది,... ఆ ఫ్రిజ్ కు "డోంట్ టచ్" అనే స్టిక్కర్ ను అతికించింది.. మోనికా తన బిడ్డకు అంత్యక్రియలు నిర్వహించాలి.. డేట్ సర్టిఫికేట్ ఇవ్వమని ఆస్పత్రి యాజమాన్యాన్ని వేడుకొంటోంది. ఈ వ్యవహారంపై ఆస్పత్రి డైరెక్టర్ జూలియో సిల్వా స్పందిస్తూ... ఆస్పత్రి నిబంధనల ప్రకారం.. మరణ ధృవీకరణ పత్రం ఇచ్చే వరకూ... మృతశిశువును మార్చురీలో ఉంచాలని.. సర్టిఫికెట్ తో పాటు... బిడ్డను తల్లిదండ్రులకు అప్పగించాలని ఆయన ఆదేశించారు.. అంతేకాదు.. డేట్ సర్టిఫికేట్ ఇవ్వడం లో నిర్లక్షం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకొంటామని చెప్పారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







