'సైజ్‌ జీరో' చిత్రంలో తొమ్మిది మంది స్టార్స్ గెస్ట్ లు

- November 16, 2015 , by Maagulf
'సైజ్‌ జీరో' చిత్రంలో తొమ్మిది మంది స్టార్స్ గెస్ట్ లు

 అనుష్క, ఆర్య ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'సైజ్‌ జీరో' . ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. అనుష్క, ఆర్య, సోనాల్‌ చౌహాన్‌ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ 'సైజ్‌ జీరో' చిత్రంలో ఏకంగా తొమ్మిది మంది స్టార్స్ గెస్ట్ లుగా కనిపించి,అలరించబోతున్నారు. వీరందరికీ కథలో గెస్ట్ అప్పీరియన్స్ లు మాత్రమే కాదని, కథకు ఇంపార్టెంట్ ఉన్నవి అంటున్నారు. ఇంతకీ ఎవరా స్టార్స్ అంటే క్రింద స్లైడ్ షో చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాలో అనుష్క రెండు విభిన్న షేడ్స్ లో కనిపించనుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు, 'అనగనగా ధీరుడు' సినిమా దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూండటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. 'బాహుబలి', 'రుద్రమదేవి' సినిమాల తర్వాత అనుష్క నటిస్తున్న మరో భారి బడ్జెట్ సినిమా కావటంతో బిజినెస్ పరంగానూ చాలా క్రేజ్ తో విడుదల కానుంది. నాగార్జున ఈ చిత్రంలో నాగార్జున స్మార్ట్ అండ్ సింపుల్ క్యారక్టర్. ''సూపర్‌'తో అనుష్కని తెలుగు తెరకు పరిచయం చేసింది నాగార్జున. అందుకే అనుష్క నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ముగ్గురు హీరోయిన్స్... హన్సిక, తమన్నా, కాజల్‌.. ఈ ముగ్గురూ అనుష్కకు మంచి స్నేహితులు. 'సైజ్‌ జీరో' కథ వాళ్లకు బాగా నచ్చింది. ఓ మంచి ఉద్దేశంతో తెరకెక్కించిన ఈ చిత్రంలో తాము కూడా భాగస్వాములు కావాలనుకొన్నారు. వీళ్లిద్దరూ... రానా, మంచు లక్ష్మీ ప్రసన్నలతో దర్శకుడు ప్రకాష్‌ కోవెలమూడికి మంచి అనుబంధం ఉంది. అందుకే వాళ్లిద్దరూ ఓ సన్నివేశంలో మెరుస్తారు. శ్రీదివ్య అలాగే ఆర్యతో కలసి శ్రీదివ్య 'బెంగళూర్‌ డేస్‌' చిత్రంలో నటించింది. ఆ అనుబంధంతో శ్రీదివ్య ముందుకొచ్చింది. అందుకే. . ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రేమతోనో, నటీనటులపై ఉన్న అభిమానంతోనో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు... అని చిత్ర యీనిట్ చెబుతోంది. ఫేక్ కాదు.. 'నేను లావుగా కనిపిస్తున్న లుక్ ఫేక్ కాదు. ఆ సినిమాకోసం నేను కార్బోహైడ్రేట్స్ తీసుకొని లావు అయ్యానని' అని అనుష్క తెలిపింది. ఏకంగా 17 కేజీలు 'సైజ్‌ జీరో' చిత్రంలో ఆమె లావుగా కనపడటం అబద్దమని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆమె టీవి 9 తో మాట్లాడుతూ ఇలా స్పందించింది. 17 కిలోలు ఆమె ఈ సినిమా కోసం పెరిగింది. నవల ఆధారంగా... యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథ, కథనాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. కోవెలమూడి ప్రకాష్ భార్య ఈ నవలను రాసినట్లు తెలుస్తోంది. హైలెట్.. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో షూటింగ్ చేస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించంట హైలెట్. భార్య సహకారం ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి ప్రకాష్ కోవెలమూడి భార్య అయిన కనిన ధిల్లన్ కథ - స్క్రీన్ ప్లే అందించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com