లండన్‌: టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ యూకే విభాగం ఆధ్వర్యంలో ఘనంగా దీక్షా దివస్

లండన్‌: టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ యూకే విభాగం ఆధ్వర్యంలో ఘనంగా దీక్షా దివస్

లండన్: టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ యూకే విభాగం ఏడో వార్షికోత్సవ వేడుకలతో పాటు దీక్షా దివస్‌ను లండన్‌లో ఘనంగా నిర్వహించారు. శాంతియుతంగా సాగిన తెలంగాణ సాధన ఉద్యమం ప్రపంచానికే ఆదర్శమని ఎన్నారై విభాగం అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం పేర్కొన్నారు. నాడు కేసీఆర్ చేసిన దీక్షే తెలంగాణ సాధనలో కీలక ఘట్టమని ఆయన అన్నారు. నాడు భారత స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీజీ ఎంచుకున్న అహింసా పద్ధతిని మన తెలంగాణ గాంధీజీ - కేసీఆర్ ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర సాధనలో హింసకు తావు లేకుండా, శాంతియుతంగా ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ సేవకుడిగా.. నేడు ముఖ్యమంత్రిగా ప్రజలకు పాలన అందించడం తెలంగాణ ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ యూకే విభాగం వార్షికోత్సవం సందర్భంగా కేక్‌ను కట్ చేశారు. 

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసర్ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, సెక్రటరీలు శ్రీధర్ రావు, సృజన్ రెడ్డి , సంయుక్త కార్యదర్శి మల్లారెడ్డి బీరం, అధికార ప్రతినిధులు హరిగౌడ్ నవాబుపేట్, రమేష్ యెసంపల్లి, మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల, ఐ.టీ సెక్రటరీ వినయ్ ఆకుల, ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్, వెల్ఫేర్ ఇంచార్జ్ రాజేష్ వర్మ, ఈవెంట్ ఇంచార్జ్ సత్యపాల్ రెడ్డి, ఈస్ట్ లండన్ ఇంచార్జ్ నవీన్ మాదిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యులు రవి కుమార్ రత్తినేని పాల్గొన్నారు.

Back to Top