కర్ణాటకలో తెర తీసిన మరో బాబా
- December 08, 2017
కర్ణాటకలో మరో బాబా రాసలీలు బహిర్గతమయ్యాయి. కొప్పళ జిల్లా గంగావతి కల్కట కొట్టూరు స్వామి పలువురు మహిళలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. పలు విద్యా సంస్థలు కలిగిన స్వామీజీ అక్కడ పనేచేసే మహిళా ఉపాధ్యాయులు, వంట మనుషులతో ఆయనకు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు బయటపడడంతో భక్తులతో పాటు స్థానికుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఆశ్రమాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించకుండా మద్యం తాగుతూ, మాంసాహారం తింటూ,మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. బ్యాంకాక్, తైవాన్ నుంచి వచ్చే మహిళా భక్తులతోనూ ఆయన సత్ససంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనకు సహకరించని మహిళలను పిస్టల్‌తో బెదిరించి లొంగదీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. స్వామీజీ కామకలాపాలు వెలుగులోకి రావడానికి ఆయన కారు డ్రైవరే కారకుడని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







