అబ్దుల్' షార్ట్ ఫిల్మ్ ఏషియన్ పనోరమ 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ ప్రదర్శనకు ఎంపిక

- November 16, 2015 , by Maagulf
అబ్దుల్'  షార్ట్ ఫిల్మ్ ఏషియన్ పనోరమ 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ ప్రదర్శనకు ఎంపిక

బాలల దినోత్సవం సందర్భంగా 19వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం శిల్పకళా వేదికలో అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. నవంబర్ 14 నుంచి వారం రోజులపాటు జరిగే ఈ బాలల చిత్రోత్సవాలలో తెలుగు వన్ రూపొందించిన 'అబ్దుల్' అనే షార్ట్ ఫిల్మ్ ఏషియన్ పనోరమ 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ౦లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ చిత్రాన్ని ఈ రోజు ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్ 2 లో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రదర్శించబోతున్నారు. మరోవైపు ఈ చిత్రోత్సవాలలో సినీ ప్రముఖుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బాలీవుడ్ నటి కరిష్మా కుమార్తె సమైరా దర్శకత్వం వహించిన 'బీ హ్యాపీ' చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సందర్భంగా కుమార్తె సమైరా, సోదరి కరీనా కపూర్ లతో కరిష్మా చిత్రాన్ని వీక్షించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com