శ్రీవారి సర్వదర్శనానికి స్లాట్స్
- December 08, 2017
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్న సామాన్య భక్తుల కష్టాలు తీరనున్నాయి. సర్వదర్శనానికీ స్లాట్ విధానం ప్రవేశపెట్టి భక్తులకు 2 గంటలకు మించకుండా స్వామి వారి దర్శనం కల్పించాలని టీటీడీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 10, 12 తేదీలలో ప్రయోగాత్మకంగా స్లాట్ విధానం అమలుకు టీటీడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిత్యం 22 వేల నుంచి 38 వేల మంది భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో 21 ప్రాంతాలలో 150 కౌంటర్లు ద్వారా టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాటు చేపట్టారు.టోకెన్ పొందాలంటే ఆధార్ కార్డును తప్పనిసరి చేశారు టీటీడీ అధికారులు. ఒక్కసారి టోకెన్ పొందిన భక్తుడికి మరో 48 గంటల వరకు టోకెన్ పొందే అవకాశం ఉండదు. ఫిబ్రవరి నుంచి నూతన విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. టోకెన్లు లేకుండా కంపార్టుమెంట్లులో వేచి ఉన్న భక్తులను కూడా సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఇప్పటికే నిత్యం ప్రత్యేక ప్రవేశ దర్శనం, నడకదారి భక్తులు కలిపి 38 వేల మందికి టోకెన్లు జారీ చేస్తున్నారు.
ఈ స్లాట్ విధానం అమలులోకి వస్తే భక్తులందరికీ శ్రీవారి దర్శనం సులభతరంగా లభిస్తుందని టీటీడీ అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







