సౌదీ యజమాని పనిమనిషిపై అత్యాచారయత్నం.. వీడియో వైరల్
- December 08, 2017
రియాధ్: ఉపాధి కోసం గృహ సేవకురాలిగా సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ ఫిలిప్పీన్ మహిళ తన యజమానిటీ ద్వారా లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు సామాజిక మాధ్యమాలలో ఓ వీడియో వైరల్ కాబడి స్థానికంగా సంచలనం కల్గిస్తుంది. ఏజెంట్ల మాయ మాటలు నమ్మి ఓ ఇంట్లో పనిమనిషిగా చేరేందుకు సౌదీకి వెళ్లిన ఆమెపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడో సౌదీ యజమాని. ఆ దృశ్యాలు అనుకోకుండా బయటపడటంతో ఆగ్రహించి ఆమెను తన ఇంట్లో బంధించాడు. ఫిలిప్పీన్‌కు చెందిన బెత్ లిలీ.. బతుకుదెరువు కోసం సౌదీకి వచ్చింది. ఊహించని రీతిలో యజమాని తనపై అత్యాచారయత్నం చేస్తుండగా తీవ్రంగా ప్రతిఘటించింది. కత్తి తీసుకుని ఆ దుర్మార్గుడిని బెదిరించింది. దీంతో అక్కడి నుంచి యజమాని వెళ్లిపోయాడు. ఈ ఘటనను గుర్తు తెలియని వ్యక్తి రహస్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్ అవడంతో ఆమెపై ఆగ్రహించి ఇంట్లో బంధించాడు. కాళ్లు కట్టేసి గదిలో బంధించాడు. తన పరిస్థితిని వివరిస్తూ.. తన ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేసిందామె. గట్టిగా మాట్లాడితే బయట ఉన్న యజమానికి వినిపిస్తుందనే భయంతో చిన్నగా మాట్లాడుతూ తన పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చెప్పింది. ఎవరైనా తనను రక్షించాలని కోరింది. తనకు ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని పశ్చాత్తాపపడుతుంది...ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరైనా ముందుగా చెప్పి ఉంటే అసలు సౌదీ రాకపోయేదానినని . తాను మళ్లీ ఫిలిప్పీన్ వెళ్లిపోతాననీ, అక్కడే ఏదో ఒక పనిచేసుకుని బతుకుతానని కన్నీరుమున్నీరవుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







