ఈజిప్ట్‌లో కొత్త దేశాన్ని సృష్టించిన భారతీయుడు...

- December 08, 2017 , by Maagulf
ఈజిప్ట్‌లో కొత్త దేశాన్ని సృష్టించిన భారతీయుడు...

చిన్నప్పుడు చందమామ కథల్లో చదువుకున్నాము. శత్రు రాజ్యం మీదకు దండెత్తి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం.. ఇలాంటి కథలు చాలానే చదివి ఉంటాము. అచ్చంగా అలానే అనిపిస్తుంది ఇప్పుడు సుయాష్ దీక్షిత్ చేసిన పని చూస్తుంటే.  కాకపోతే దండెత్తకుండానే రాజ్యాన్ని తన వశం చేసుకున్నాడు... 
ఒక భారతీయుడు ఈజిప్టు సరిహద్దులో ఒక దేశాన్ని సృష్టించి దానికి రాజయ్యాడు. ఈజిప్టు-సుడాన్‌కి మధ్య ఉన్న స్థలంలో ఉగ్రవాదుల ఆగడాలు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతం తమ దేశంలోది కాదంటూ ఇరు దేశాలు వాదించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇండోర్‌కి చెందిన భారతీయ వ్యాపార వేత్త సుయాష్ దీక్షిత్ తన సుదీర్ఘ ప్రయాణంలో ఈ విషయం తెలుసుకున్నాడు. ఈ భూమి ఏ దేశానికీ చెందినది కాదు కాబట్టి తనే ఆక్రమించుకుని తనే రాజుగా ప్రకటించుకున్నాడు. పనిలో పనిగా తన వెంట తీసుకువెళ్లిన సన్ ప్లవర్ విత్తనాలు ఆ ప్రాంతంలో చల్లాడు. తన రాజ్యానికి కింగ్ సుయాష్ వన్‌ అని, దానికి రాజధాని సుయాష్ పూర్ అని పేర్లు కూడా ప్రకటించేశాడు. ఆ రాజ్యానికి తన తండ్రిని ప్రధానమంత్రిని చేశాడు. ఆ రాజ్యంలో ఓ జెండా పాతి ఇది నా రాజ్యం అంగీకరించమంటూ ఐక్యరాజ్యపమితికి లెటర్ పెట్టాడు. తన కొత్త రాజ్యానికి బల్లిని జాతీయ జంతువుగా ప్రకటించాడు సుయాష్ రాజు గారు. అక్కడ వ్యవసాయం కూడా మొదలెట్టేశాడు. ఫారెన్ ఇన్వెస్ట్ మెంట్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానంటున్నాడు. దీని కోసం ఓ వెబ్ సైట్ ఏర్పాటు చేశాడు. ఈ వివరాలన్ని ఫేస్‌బుక్‌లో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com