తెలుగు ఫిల్మ్‌చాంబర్ కీలక నిర్ణయం.!

- December 08, 2017 , by Maagulf
తెలుగు ఫిల్మ్‌చాంబర్ కీలక నిర్ణయం.!

పండుగలకు డబ్బింగ్ సినిమాల విడుదలపై తెలుగు ఫిల్మ్‌చాంబర్‌ నిషేధం విధించింది.! ఇవాళ మధ్యాహ్నం తెలుగు ఫిల్మ్‌చాంబర్ ప్రతినిధులు అత్యవసర భేటీ అయ్యారు. భేటీలో పలు విషయాలపై చర్చించారు. ముఖ్యంగా పండగలకు డబ్బింగ్‌ సినిమాలు విడుదలపై సుమారు రెండు గంటలపాటు చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పండుగలకు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేయకూడదని నిర్ణయానికొచ్చారు. మరోవైపు డిజిటల్‌ ప్రసారాల రేట్లను తగ్గించకుంటే వచ్చే మార్చి 1 నుంచి సినిమాలను నిలిపివేయాలని యోచనలో ఉన్నారు. తెలుగు సినిమాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

తెలుగువారికి ప్రధాన పండుగలైన సంక్రాంతి, దసరా తెలుగు సినిమాలు మినహా, వేరే ఇతర భాషల్లో అనువదించిన సినిమాలు విడుదల చేయకూడదని ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అధికారికంగా ప్రకటిస్తారా లేదా అనే విషయం తెలియరాలేదు. అయితే తెలుగు ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు అనధికారికంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇందుకు సంబంధించి ఇంత వరకూ స్పష్టత రాలేదు.. ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు కూడా ఎవరూ స్పందించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com