పిన్నీ

- December 08, 2017 , by Maagulf
పిన్నీ

కావలసిన పదార్థాలు: మైదా - పావుకేజి, సేమియా - 25 గ్రా., నెయ్యి - 100గ్రా., పంచదార - 200గ్రా., బెల్లం - 5 గ్రా., యాలకుల పొడి - 2 గ్రా., బాదం - 5 గ్రా., పిస్తా - 5 గ్రా., సిల్వర్‌ లీఫ్‌ కొద్దిగా.
తయారుచేసే విధానం: కడాయిలో 50 గ్రా. నెయ్యివేసి అందులో సేమియా, మైదా జతచేస్తూ సన్నని మంటపై దోరగా వేగించి పక్కన ఉంచాలి. పంచదారని మెత్తగా పొడి చేసుకుని ఈ మిశ్రమంలో కలపాలి. మరో కడాయిలో మిగతా నెయ్యిలో బాదం, పిస్తాలను వేగించి బెల్లం, యాలకుల పొడి, మైదా మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. పిడికిట్లో పట్టేంత మిశ్రమాన్ని తీసుకుని మీకు నచ్చిన ఆకారాల్లో చేసుకొని పైన సిల్వర్‌ లీఫ్‌ను అంటించుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com