ఎమిరేటీ సైనికుడికి జైలు శిక్ష

- December 09, 2017 , by Maagulf
ఎమిరేటీ సైనికుడికి జైలు శిక్ష

ఎమిరేటీ సైనికుడొకరికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 30 ఏళ్ళ ఎమిరేటీ, ఉద్దేశ్యపూర్వకంగా ఓ పోలీస్‌ అధికారిని గాయపర్చడమే కాకుండా, పబ్లిక్‌ ప్రాపర్టీని ధ్వంసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం అరెస్ట్‌ చేసేందుకు యత్నించగా, మరింత దురుసుగా నిందితుడు వ్యవహరించడం జరిగింది. ఈ క్రమంలో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఆగస్ట్‌ 21న న్యాయస్థానం నిందితుడిపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. అరెస్ట్‌ని తప్పించుకునే క్రమంలో నిందితుడు, పోలీస్‌ పెట్రోల్‌ కారుని బలంగా ఢీకొట్టాడనీ, అతన్ని నిలువరించేందుకు తాను కిందికి దిగగా, కారుతో తనను కూడా ఢీ కొట్టాడని గాయపడ్డ పోలీస్‌ అధికారి ఒకరు న్యాయస్థానానికి తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com