తగ్గిన స్పీడ్ లిమిట్స్: తగ్గనున్న ప్రమాదాలు
- December 09, 2017
రియాద్: సవరించిన కొత్త స్పీడ్ లిమిట్స్ కారణంగా, రోడ్డు ప్రమాదాలు తగ్గనున్నాయని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ సూచనల మేరకు పలు రోడ్లపై స్పీడ్ లిమిట్స్‌ని సవరించారు. 2020 నాటికి 25 శాతం రోడ్డు ప్రమాదాల్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు. చిన్న వాహనాలకి స్పీడ్ లిమిట్‌ని గంటకు 140 కిలోమీటర్లుగా నిర్ణయించారు. ఇంకో వైపున ప్రమాదాల్ని తగ్గించేందుకుగాను సైన్ బోర్డ్స్, గైడ్స్‌ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. రియాద్ - దమ్మమ్, రియాద్ - తైఫ్, రియాద్ కాస్సిమ్ రోడ్లపై 2018 తొలి క్వార్టర్ నాటికి ప్రత్యేక చర్యలు చేపడతారు. గత ఏడాది 9,031 మరణాలు సంభవించాయి. 12 శాతం మరణాల పెరుగుదల నమోదు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. 2007 తర్వాత ఈ స్థాయిలో మరణాల శాతం పెరగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







