ఎడారిలో వేటకొచ్చిన 'సాహో' డైరెక్టర్
- December 11, 2017
డైరెక్టర్ సుజిత్ ఎడారి లో బిజీ బిజీ గా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన ప్రభాస్ తో సాహో మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. మొన్నటి వరకు ఈ చిత్ర షెడ్యూల్ హైదరాబాద్ లో జరిగింది. నెక్స్ట్ షెడ్యూల్ దుబాయ్ లోని ఎడారి లో ప్లాన్ చేసారు. ఇందుకు గాను హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ తో కలిసి సుజిత్ ఆ లొకేషన్స్ వేట లో పడ్డాడు.
బుర్జ్ ఖలీఫా టవర్, రస్-అల్-ఖమా వరల్డ్ ట్రేడ్ సెంటర్, అబుదాబిలోని ఇతిహాద్ టవర్ తో పాటు దుబాయ్ శివార్లలోని భారీ ఎడారి, కొండల మధ్య ఛేజింగ్ సన్నివేశాలు తీయబోతున్నారు. సినిమాలో ఉండే 20 నిమిషాల భారీ యాక్షన్ పార్ట్ కోసం ఈ లొకేషన్స్ ను సెలెక్ట్ చేశారట. జనవరి నుంచి ఈ షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారని సమాచారం.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 150కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కబోతుంది. తెలుగు , హిందీ , తమిళ్ భాషల్లో ఈ మూవీ రాబోతుంది. ప్రభాస్ కు జోడిగా శ్రద్ద కపూర్ నటిస్తుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







