తెలుగు మహాసభలకు ముస్తాబవుతున్న హైదరాబాద్

- December 11, 2017 , by Maagulf

ఈ నెల 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో తెలుగు మహాసభలను చాల గ్రాండ్ గా తెలంగాణ సర్కార్ నిర్వహించబోతున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే ఈ సభలకు కావాల్సిన అన్ని ఏర్పట్లను పూర్తి చేసారు. మరోపక్క తెలుగు మహాసభల విశిష్టతను, గొప్పదనాన్ని తెలియజేసే విధంగా హైదరాబాద్ అంత తెలుగు తోరణాలతో నింపేశారు. ఎక్కడ చూసిన స్వాగత తోరణాలు కనిపిస్తున్నాయి.

ఈ తోరణాలకు మధ్య భాగంలో తెలంగాణ తల్లి ప్రతిమను ఏర్పాటు చేశారు. ఒక్కో చోట ఒక మహనీయుడి పేరుతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఈ సభలకు దేశ విదేశాల నుంచి అతిరధులు రాబోతున్నారు. వీరికి అపూర్వ స్వాగతం పలికేందుకు హైదరాబాద్ రెడీ అయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com