దోహలో 'దోహా కుటుంబం' వారి నేతృత్వంలో నేత్రపర్వంగా దీపావళి
- November 16, 2015
దోహాలో కార్నిష్ సమీపంలో ఉన్న ఎలిగెన్స్ కేజిల్ హోటల్ లో కతార్ లోని తెలుగు వారి ప్రముఖ సంస్కృతిక సంస్థ 'దోహా కుటుంబం' వారి నేతృత్వంలో తేది 13.11.15 న నేత్ర పర్వంగా నిర్వహింపబడ్డాయి. ఈ ఈవెంట్ లో 70 మంది దాకా పాల్గొన్నారు. ఈ దీపావళి సంబరాలు, చిన్నారుల ప్రార్ధనతో మహిళా మణుల జ్యోతి ప్రజ్వలనతో సుభారంబమయ్యాయి. అనంతరం వారు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కొందరు మహిళలు ఆవరణను రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్దారు. తరువాతి అంశాలుగా పిల్లల సోలో, డ్యూయెట్ మరియు బృంద నృత్య ప్రదర్సనలు, స్త్రీమూర్తుల నృత్య గాన ప్రదర్శనలు సాగాయి. పిల్లలు, పెద్దల కోసం ఆటల పోటీలు, పెళ్ళైన వారి సంయుక్త ఆటలు, సాముహిక క్రీడలతో అక్కడి వాతావరణం కోలాహలంగా మారింది. ఆబాలగోపాలం ఇక్కడకు విచ్చేసిన ఆటపాటల్లో మురిసిపోయారు. గ్రూప్ ఫోటోగ్రఫీ, బహుమతుల పంపిణీ తో ఈ కార్యక్రమానికి భరతవాక్యం పలికి, మరల త్వరలోనే కలసుకోనేందుకు ఉవ్విళ్ళూరుతూ అందరూ వీడ్కోలు పలికారు.




తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







