విరుష్కల వివాహంపై ఎందుకీ మిస్టరీ

- December 11, 2017 , by Maagulf
విరుష్కల వివాహంపై ఎందుకీ మిస్టరీ

భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ స్టార్‌ అనుష్క శర్మల పెళ్లి ఈ నెల 12 న(రేపు) ఇటలీలోని టస్కనీ నగరంలోని ఓ బోర్గో ఫినోచీటోలో వివాహ వేడుకకు రంగం సిద్ధమైందని.. అక్కడి రిసార్ట్‌లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవనున్నారని ఇపుడు జరుగుతున్న చర్చ. ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఓ స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ ఓ షాకింక్‌ న్యూస్‌ తెలిపారు. 'విరాట్‌ - అనుష్కల పెళ్లి జరగబోవడం కాదు.. అల్‌రెడీ వాళ్లు పెళ్లిచేసుకున్నారు' అని ట్వీట్‌ చేశారు. గత శనివారమే ఆ జంట ఒక్కటైందన్నారు. ఈ విషయాన్ని త్వరలో విరుష్కలు అధికారంగా ప్రకటిస్తారని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.డిసెంబర్‌ 9-12 తేదీల మధ్యలో వీరి వివాహం జరుగుతుందనే తొలుత ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజా వార్త ఆసక్తికరంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com