రియాద్ లో ఎలక్ట్రానిక్ యుద్ధతంత్రంపై సమావేశం

- December 12, 2017 , by Maagulf
రియాద్ లో ఎలక్ట్రానిక్ యుద్ధతంత్రంపై సమావేశం

రియాద్: ఒకవేళ యుద్ధమే సంభవిస్తే ..ఇరుదేశాల సైనికులు ఎదురెదురుగా కాకుండా శాస్త్ర సాంకేతికతలే నేలపై..నీటిపై ..ఆకాశంలో ప్రధాన భూమిక పోషించనున్నాయి. రియాద్ లో మంగళవారం కింగ్ అబ్దుల్జాజ్ సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ (కెఎసిఎస్ఎస్) ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైన ఐదవ అంతర్జాతీయ సదస్సు మరియు ఎగ్జిబిషన్ లో 20 దేశాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు. కింగ్ అబ్దుల్జాజ్ సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ (కెఎసిఎస్ఎస్) మరియు రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నఈ సమావేశం క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ యొక్క మద్దతుతో కొనసాగనుంది. .ఎలక్ట్రానిక్ యుద్ధతంత్రం మరియు రాడార్ యొక్క ఐదవ అంతర్జాతీయ సమావేశంలో నేషనల్ సెంటర్స్ ఫర్ సెన్సార్స్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ సుల్తాన్ అల్మోరికీ ఈ సమావేశంలో మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో 57 మంది వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు. వీరిలో 52 శాతం మంది సౌదీ ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రదర్శనలు సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ ఆపరేషన్స్, ఓడల నుంచి  ఇ-వార్ సొల్యూషన్స్, డిజిటల్ సిగ్నల్ నిర్మాణం, ఇ-వార్ ఆపరేషన్స్, ఇ-వార్ డేటాబేస్ నిర్వహణ, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ( యుద్ధతంత్రం ) పద్ధతుల్లో పలు ప్రదర్శనలతో  సౌదీ అరేబియా లోపల మరియు వెలుపల నుండి ఎదుర్కొనే విధానం ఇక్కడ ప్రదర్శించారు. ఇ-వార్ లో తాజా సాంకేతిక ప్రదర్శించడానికి ప్రధాన సింపోజియం తో ఏకకాలంలో కొనసాగింపచేస్తుంది.ఈ రెండురోజుల సమావేశం యొక్క  ముఖ్య లక్ష్యాలు ఏమిటంటే, రాడార్ లో శాస్త్రీయ పరిశోధన ప్రోత్సహించడం ఎలక్ట్రానిక్ యుద్ధం, ఆధునిక యుద్ధాల్లో ఈ సాంకేతిక  ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకోవడం మరియు వాటిని ప్రదర్శించడం ద్వారా  ఆధునిక అభివృద్ధి , రాడార్ మరియు ఎలక్ట్రానిక్ యుద్ధతంత్రాలలో విజయవంతమైన అంతర్జాతీయ ప్రయత్నాలను చూపినందుకు దోహదపడనుంది. .మంగళవారంమొదటి సమావేశం "సాంకేతిక పరిజ్ఞానం (అవకాశాలు మరియు సవాళ్లు) యొక్క స్థానికీకరణపై ఉంటుంది" మరియు ఈ రోజు జరిగే ( బుధవారం)  "బలమైన మరియు స్థిరమైన ఆధునిక జాతీయ సైనిక యుద్ధతంత్ర సామర్ధ్యం " గూర్చి చర్చించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com